అశ్వారావుపేటరూరల్: ఉద్యాన పంటలపై పరిశోధనలను మరింతగా పెంచాలని శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం ఆయన స్థానిక హెచ్‌ఆర్‌ఎస్‌తో పాటు మండలంలోని అల్లిగూడెంలో సాగు చేస్తున్న బూడిద గుమ్మడి, మునగ, మిర్చి పంటలను, దమ్మపేట మండలం లింగాలపల్లిలో మామిడి తోటలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యాన తోటల పరిశోధనలకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఉద్యాన పంటల సాగులో పాటించాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం స్థానిక హెచ్‌ఆర్‌ఎస్‌లో జరిగిన వేలం పాటకు హాజరయ్యారు. ఉద్యాన పరిశోధన కేంద్రం ద్వారా సాగు చేస్తున్న మామిడి, జీడి మామిడి, కొబ్బరి, సపోటా, పనస తోటలకు వేలం నిర్వహించగా పలువురు వ్యాపారులు కై వసం చేసుకున్నారు. తద్వారా హెచ్‌ఆర్‌ఎస్‌కు రూ.10,78,500 ఆదాయం సమకూరినట్లు లక్ష్మీనారాయణ తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో హెచ్‌ఆర్‌ఎస్ శాస్త్రవేత్తలు డాక్టర్ విజయ్ కృష్ణ, డాక్టర్ కె నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ లక్ష్మీనారాయణ