ఊరువాడ ఘనంగా హోలీ వేడుకలు
జిల్లావాసులు హోలీ వేడుకలు శుక్రవారం వేడుకగా జరుపుకున్నారు. చిన్నాపెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ సంబరంగా గడిపారు. కాలనీలు, అపార్ట్‌మెంట్లలో సామూహికంగా రంగుల పండుగ జరుపుకోగా.. పలువురు జట్లుగా విడిపోయి స్నేహితుల ఇళ్లకు వెళ్లి రంగులు పూసి శుభాకాంక్షలు తెలిపారు. హేమచంద్రాపురంలోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ఉద్యోగులతో కలిసి ఎస్పీ రోహిత్‌రాజ్ హోలీ జరుపుకున్నారు. పాటలకు అనుగుణంగా డప్పు మోగిస్తూ నృత్యం చేసిన ఆయన ఉద్యోగులను ఉత్సాహపరిచారు. కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు డీఎస్పీలు అబ్దుల్ రెహమాన్, ఎన్.చంద్రభాను, రవీందర్‌రెడ్డితో పాటు సీఐ బత్తుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాగా, అశ్వారావుపేటలోని వ్యవసాయ కళాశాలలో విద్యార్థులు రంగులకు బదులు బురదలో హోలీ వేడుకలు జరుపుకోవడం విశేషం. – సాక్షి నెట్‌వర్క్
రంగుల హరివిల్లు..
రంగుల హరివిల్లు..
రంగుల హరివిల్లు..
రంగుల హరివిల్లు..