నేడు యూత్‌ కాంగ్రెస్‌ సమావేశం | Sakshi
Sakshi News home page

నేడు యూత్‌ కాంగ్రెస్‌ సమావేశం

Published Tue, Apr 23 2024 8:35 AM

-

ఖమ్మం వన్‌టౌన్‌: లోక్‌సభ ఎన్నికల నేపథ్యాన ఖమ్మం పార్లమెంటరీ స్థాయి యువజన కాంగ్రెస్‌ సమావేశాన్ని మంగళవారం నిర్వహిస్తున్నట్లు యువజన కాంగ్రెస్‌ జిల్లాయడ్లపల్లి సంతోష్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఉదయం 10.30గంటలకు మొదలయ్యే ఈ సమావేశంలో యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌చార్జ్‌లు సురభి ద్వివేది, ఖలీద్‌ మహ్మద్‌, రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, జోనల్‌ ఇన్‌చార్జ్‌ జెషన్‌ అహ్మద్‌, పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ నాగిరెడ్డి సందీప్‌ రెడ్డి ముఖ్య అతిథులగా పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ మేరకు యువజన కాంగ్రెస్‌ కమిటీల బాధ్యులు, నాయకులు హాజరుకావాలని సంతోష్‌ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో కోరారు.

Advertisement
 
Advertisement
 
Advertisement