
వివరాలు తెలుసుకుంటున్న వైద్యాధికారులు
అన్నపురెడ్డిపల్లి : గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని స్టేట్ ఆర్మాన్ టీం సభ్యులు డాక్టర్ శ్రీకీర్తి, డాక్టర్ అఖిల సూచించారు. గురువారం అన్నపురెడ్డిపల్లి మండలంలోని ఎర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా మాతా, శిశు సంరక్షణ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ చైతన్యతో కలిసి సందర్శించారు. గర్భిణులకు అందిస్తున్న సేవల గురించి వైద్యాధికారులు ప్రియాంక, తన్మయిని అడిగి తెలుసుకున్నారు. మాతా శిశు సంరక్షణ కార్డులను పరిశీలించి, కార్డులను పూర్తిగా పూరించాలన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణులకు రెగ్యులర్‌గా చెకప్ చేయాలని, రక్తహీనత ఉన్నవారికి ఐరన్ ఇంజెక్షన్ ఇవ్వాలని సూచించారు. ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేయించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రతి మంగళవారం నిర్వహించే ఆరోగ్య మహిళా క్లినిక్‌ను మహిళలు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌ఎన్‌ఓ ఎస్తేర్‌రాణి, హెచ్‌ఈఓ కృష్ణయ్య , హెచ్‌ఈ శారారాణి సిబ్బంది పాల్గొన్నారు.