నాడు వడివడి.. నేడు తడబడి! | - | Sakshi
Sakshi News home page

నాడు వడివడి.. నేడు తడబడి!

Jun 17 2026 4:51 AM | Updated on Jun 17 2026 4:51 AM

బుధవారం శ్రీ 17 శ్రీ జూన్‌ శ్రీ 2026 నాడు వడివడి.. నేడు తడబడి! చీరాల అర్బన్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్‌ల మాటల గారడీతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇక్కట్లు తప్పేలా లేదు. పాఠశాలలు వేసవి సెలవుల తర్వాత ఇప్పటికే పునఃప్రారంభం అయ్యాయి. పలు ప్రాంతాల్లో పాఠశాలలు ప్రశ్నార్థకంగా ఉన్నాయి. నాడు– నేడు పేరుతో గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. నాడు–నేడు కింద జిల్లాకు (అద్దంకి నియోజకవర్గంలోని ఐదు మండలాలతో కలిపి) రూ.183.33 కోట్లు కేటాయించారు. అందులో పూర్తయిన పనులకు రూ.102.33 కోట్లు విడుదల చేశారు. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా లోకేష్‌లు ప్రైవేటు, కార్పొరేట్‌లకు కొమ్ముకాస్తున్నారు. ఈ క్రమంలో గత రెండు సంవత్సరాల్లో నాడు– నేడులో మిగిలిన నిర్మాణాలకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. వైఎస్‌ జగన్‌ చేతల్లో చూపితే.. చంద్రబాబు మాటల్లో పని చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. గత పాలనలో చదువుల వెలుగులు వైఎస్సార్‌ సీపీ హయాంలో నాడు–నేడు కింద చేపట్టిన పనులతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. వాటిని చూసిన ర్పొరేట్‌కు దీటుగా, ప్రయివేటు కన్నా మిన్నగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకున్నాయని కొనియాడారు. తరగతి గదులు, ల్యాబ్‌లు, భోజనశాలలు, తాగునీరు, మరుగుదొడ్లు, వసతి... ఇలా ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపారు. నాడు– నేడులో ఎంపిక నాడు– నేడు కింద జిల్లాలో (అద్దంకి నియోజకవర్గంలోని ఐదు మండలాలతో కలిపి) 526 పాఠశాలలు ఎంపిక చేశారు. వాటిలో కొన్ని కొత్తవి, కొన్ని అదనపు తరగతి గదులు, మరికొన్ని మౌలిక సదుపాయాలకు సంబంధించి ఉన్నాయి. ఆయా నిర్మాణాలకుగాను రూ.183.33 కోట్లు కేటాయించారు. అందులో పూర్తి చేసిన పనులకు రూ.102.33 కోట్లు నిధులు విడుదల చేశారు. ప్రస్తుతం 112 పాఠశాలలకు సంబంధించి 272 అదనపు గదుల నిర్మాణం జరగాల్సి ఉంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, విద్యాశాఖ మంత్రిగా లోకేష్‌ బాధ్యతలు చేపట్టాక ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, ఆగిన పనులకు కేటాయించిన నిధులు శూన్యం. చేపట్టాల్సిన నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. వాటికి నిధులు కేటాయించి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు, విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

న్యూస్‌రీల్‌

జిల్లాలో పాఠశాలల వివరాలు ఇవీ...

నాటి కృషితో చక్కని ఫలితాలు

అప్పటి సీఎం జగన్‌ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంలో విద్యాబోధనకు పెద్దపీట వేశారు. అందుకు తగ్గట్లు దిశానిర్దేశం చేశారు. పేద విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల ప్రతిభ చూసి ఆనందపడ్డారు. సత్ఫలితాలు వచ్చాయి... వస్తున్నాయి. అది ఆ నాటి కృషి ఫలితమే. చంద్రబాబు పాలన వచ్చాక ప్రభుత్వ పాఠశాలలపై చిన్నచూపు తప్పలేదు. నాడు–నేడులో ఆగిన పనులకు ఈ రెండేళ్ల చంద్రబాబు పాలనలో కేటాయించింది శూన్యం. విద్యాశాఖ మంత్రి లోకేష్‌ మాత్రం వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో చేపట్టిన సంస్కరణలతో వస్తున్న ఫలితాలను తన ఖాతాలో వేసుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో నాడు– నేడులో ఆగిన పనులను పూర్తి చేసి, ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

బుధవారం శ్రీ 17 శ్రీ జూన్‌ శ్రీ 2026

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో

‘నాడు–నేడు’తో వెలుగులు

విద్యా వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధ

చూపిన నాటి సీఎం జగన్‌

కార్పొరేట్‌ కన్నా మిన్నగా

ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ

జిల్లాకు రూ.183.33 కోట్లు మంజూరు

అందులో రూ.102.33 కోట్ల విలువైన

పనులు పూర్తి.. నిధులు విడుదల

టీడీపీ పాలనలో కష్టంగా

ప్రభుత్వ పాఠశాలల మనుగడ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement