సచివాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

సచివాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌

Apr 5 2026 7:54 AM | Updated on Apr 5 2026 7:54 AM

సచివాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌ ఎస్సీ, ఎస్టీ చట్టానికి తూట్లు పొడవటం సరికాదు ● దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు ● కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన దుర్గమ్మకు పలువురి విరాళాలు మెలకువగా ఉండగానే వృద్ధుడికి బైపాస్‌ సర్జరీ

సూరేపల్లి(భట్టిప్రోలు): భట్టిప్రోలు మండలం సూరేపల్లి గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్‌ వి. వినోద్‌కుమార్‌ శనివారం తనిఖీ చేశారు. సచివాలయంలో రికార్డులు పరిశీలించి సిబ్బంది హాజరు తనిఖీ చేశారు. పెండింగ్‌ దరఖాస్తులను పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్‌ ఆదేశించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. ఆయన వెంట భూ రికార్‌ుడ్స శాఖ ఏడీ సాంబశివరావు, రేపల్లె ఆర్డీవో శ్రీదేవి, వీఆర్వో చొప్పర రవి, పంచాయతీ కార్యదర్శి పృద్వీరాజ్‌, సచివాలయ సిబ్బంది ఉన్నారు.

బాపట్లటౌన్‌: ఏన్నో ఏళ్లుగా పోరాటాలు చేసి సాధించుకున్న ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టానికి కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాలు తూట్లు పొడవటం సరికాదని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు అన్నారు. దళిత హక్కుల సాధన కోసం శనివారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు దళిత సంఘాల నాయకులతో కలిసి ఆందోళన చేశారు. నీలం నాగేంద్రరావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కేసులో హైకోర్టు కూడా యాంటీ స్పెటర్‌ బెయిల్‌ ఇవ్వకూడదని చట్టం చెబితే అగ్రకుల అరాచక శక్తులను రక్షించడానికి మోడీ, చంద్రబాబు ప్రభుత్వాలు ఏడు సంవత్సరాల శిక్ష పడే వీలున్న ఎస్సీ ఎస్టీ కేసుల్లో స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపుతుందన్నారు. ఆందోళన చేసిన వారిలో మాల మహానాడు అధ్యక్ష కార్యదర్శులు దారా అంజయ్య, కాకుమాను రవి, వివిధ సంఘాల నాయకులు పట్రా బంగారం, మేడికొండ మురళి, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు గుద్దే రాజారావు పాల్గొన్నారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరిగే నిత్యాన్నదానానికి శనివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. హైదరా బాద్‌ మోతీనగర్‌కు చెందిన పి.రజనీకాంత్‌ శర్మ ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధి కారులను కలిసి వేలంమర్రి సాంబశివ శర్మ, పద్మావతి పేరిట నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం అందజేశారు. బాపట్ల జిల్లా రేపల్లె రైలుపేటకు చెందిన ద్రోణవజ్జల బ్రహ్మ అవధాని దంపతులు, విజయవాడ సూర్యా పేటకు చెందిన బమిడిపాటి శ్రీమన్నారాయణ కుటుంబం, బమిడిపాటి శారద కుటుంబం రూ.లక్ష చొప్పున విరాళాలు అందజేశాయి. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం, ఆలయ ఏఈఓ వెంకటరెడ్డి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.

గుంటూరు మెడికల్‌: రోగి మెలకువగా ఉండగానే గుండె బైపాస్‌ సర్జరీ చేసి అతడి ప్రాణాలు కాపాడినట్లు ఆస్టర్‌ రమేష్‌ హాస్పిటల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ పోతినేని రమేష్‌బాబు చెప్పారు. ఆపరేషన్‌ వివరాలను ఆయన శనివారం గుంటూరులో మీడియాకు వెల్లడించారు. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన జయరావు(64)కు 2018లో కేన్సర్‌ సోకి ఊపిరితిత్తుల సంబంధిత సమస్య ఏర్పడటంతో ఒక ఊపిరితిత్తిని తొలగించారు. ఇటీవల చాతిలో తీవ్రమైన నొప్పి వచ్చి, తమ వద్దకు రాగా..యాంజియోగ్రామ్‌ చేసి, 3 రక్తనాళాలు పూడినట్లు నిర్థారించామన్నారు. రోగికి గుండె బైపాస్‌ సర్జరీ చేయాలని నిర్ణయించి, ఊపిరితిత్తుల సమస్య ఉండి, ఒక లంగ్‌ తీసివేయడంతో, రోగి మెలుకువగా ఉండగానే బైపాస్‌ సర్జరీ చేయాలని నిర్ణయించామన్నారు. రెండు రోజుల క్రితం కరోనరి ఆర్టరీ బైపాస్‌ గ్రాఫ్టింగ్‌ను విజయవంతంగా చేసినట్లు తెలిపారు. జయరావుకు మధుమేహం, బీపీ కూడా ఉన్నాయని, అత్యంత క్లిష్టమైన అనారోగ్య సమస్యలతో ఉన్న రోగికి తాము విజయవంతంగా బైపాస్‌ సర్జరీ చేశామని చెప్పారు. కార్యక్రమంలో హాస్పిటల్‌ డిప్యూటీ ఎండీ డాక్టర్‌ రాయపాటి మమత, ఆపరేషన్‌లో పాల్గొన్న గుండె శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్‌ జయరామ్‌పాయ్‌, సీనియర్‌ మత్తు వైద్య నిపుణుడు డాక్టర్‌ లోకనాథన్‌, వైద్యులు శివప్రసాద్‌, మృత్యుంజయ్‌, అశోక్‌కుమార్‌, భరత్‌ సిద్ధార్థ, శ్రీకాంత్‌ మహాపాత్ర, క్లస్టర్‌ బిజినెస్‌ హెడ్‌ డాక్టర్‌ కార్తీక్‌ చౌదరి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement