ప్రజల్లోకి సుందరయ్య ఆశయాలు | - | Sakshi
Sakshi News home page

ప్రజల్లోకి సుందరయ్య ఆశయాలు

Apr 5 2026 7:54 AM | Updated on Apr 5 2026 7:54 AM

ప్రజల్లోకి సుందరయ్య ఆశయాలు

యడ్లపాడు: సుందరయ్య ఆశయాలను కళారూపాల ద్వారా సమాజంలోకి తీసుకెళ్తామని కళానిలయం స్థాపక అందుకే చేసినట్లు తెలుగు నాటక కళాపరిషత్‌ల సమ్మేళన సంఘం వేదిక అధ్యక్షుడు డాక్టర్‌ ముత్తవరపు సురేష్‌బాబు చెప్పారు. యడ్లపాడులో పుచ్చలపల్లి సుందరయ్య కళా నిలయం 23వ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల రెండోరోజు పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రోజుల పాటు రెండు తెలుగురాష్ట్రాలకు చెందిన ఉత్తమోత్తమ ప్రదర్శలను ఎంపిక చేసి ఇక్కడకు తీసుకురావడం జరిగిందన్నారు. గ్రామస్తులే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కళాభిమానులు, నాటక పరిషత్తుల నిర్వాహకులు రోజుకు 2500 మంది రావడం సంతోషదాయకమన్నారు. ముందుగా పరిషత్‌ నిర్వాహకులు, న్యాయనిర్ణేతలు దాతలు సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించగా, అనంతరం ప్రజానాట్యమండలి కళాకారులు తమ అభ్యుదయ గీతాలతో సుందరయ్యకు కళాంజలి సమర్పించారు. కార్యక్రమంలో గౌరవ సలహాదారులు జరుగుల రామారావు, నూతలపాటి కాళిదాసు, ఆలోకం పెద్దబ్బయ్య, ఉపాధ్యక్షులు జరుగుల శంకర్రావు, ప్రధాన కార్యదర్శి ముత్తవరపు రామారావు, కార్యదర్శి నూతలపాటి మాధవరావు, సహాయ కార్యదర్శి చెరుకూరి సృజన, కోశాధికారి షేక్‌ బాజి, సభ్యులు నంబూరి శ్రీనివాసరావు, ముత్తవరపు పద్మారావు, పోపూరి అనంతలక్ష్మి, చెన్నుపాటి హనుమంతరావు, కల్లూరి సులోచన, తోకల కోటేశ్వరరావు, శ్రీనివాసరావు, కట్టా శ్రీహరి, సాంబశివరావు, పోపూరి శివరామకృష్ణ, జగన్‌, మాణిక్యమ్మ, మానుకొండ రామారావు, నూలు మిల్లు ఈడీ సామినేని ఫణికుమార్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement