ప్రజల నుంచి వచ్చే అర్జీలను వెంటనే పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

ప్రజల నుంచి వచ్చే అర్జీలను వెంటనే పరిష్కరించండి

Feb 17 2026 7:44 AM | Updated on Feb 17 2026 7:44 AM

ప్రజల నుంచి వచ్చే అర్జీలను వెంటనే పరిష్కరించండి

ప్రజల నుంచి వచ్చే అర్జీలను వెంటనే పరిష్కరించండి

ప్రజల నుంచి వచ్చే అర్జీలను వెంటనే పరిష్కరించండి

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌

బాపట్ల: ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అర్జీలకు పెండింగ్‌ లేకుండా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌ హాలులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిస్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమంలో మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారులు చెప్పే సమస్యలను వింటూ వారి నుంచి అర్జీలను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ భావన స్వీకరించి పరిశీలించారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఐదుగురు శాసనసభ్యులు, మంత్రి, ఎంపీ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ద్వారా మీ శాఖలకు సంబంధించి అందిన అర్జీలను వెంటనే పరిశీలించి పరిష్కారం చూపాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మీ శాఖల ద్వారా పూర్తిస్థాయిలో జరుగుతున్న పనులు, పెండింగ్‌లో ఉన్న పనుల వివరాలు, ఇంకా ఎలాంటి పనులు చేస్తే ప్రజలు సంతృప్తి చెందుతారు, ఎలాంటి సమస్యలు ఉన్నాయి వంటి వివరాలు వెంటనే సీపీఓకు అందజేయాలన్నారు. పర్యాటక శాఖ ద్వారా పనులు వెంటనే పూర్తిస్థాయిలో జరిగితే పర్యాటకులకు ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎస్‌.విజయమ్మ, సీపీఓ ఏ.ఎస్‌.రాజు, డ్వామా, డీఆర్డీఏ, మెప్మా, ఐసీడీఎస్‌, గృహ నిర్మాణ సంస్థల పీడీలు విజయలక్ష్మి, సింగయ్య, పాల్‌, రాధామాధవి, వెంకటేశ్వరరావు, మార్క్‌ఫెడ్‌ డీఎం కరుణశ్రీ, డీసీహెచ్‌ఎస్‌ పద్మావతి, డీటీసీ పరంథామరెడ్డి, జీఎండీ ఐసీ రామకృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల, డీపీఓ ఎల్‌.ప్రభాకరరావు, డీఈఓ శ్రీనివాస్‌, బీసీ, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు శివలీల, అబ్బులు, డీఎల్‌డీఓ విజయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement