నాసిరకం సీడ్‌ కష్టాలు | - | Sakshi
Sakshi News home page

నాసిరకం సీడ్‌ కష్టాలు

Jan 25 2026 7:08 AM | Updated on Jan 25 2026 7:08 AM

నాసిర

నాసిరకం సీడ్‌ కష్టాలు

ఆదివారం శ్రీ 25 శ్రీ జనవరి శ్రీ 2026 నాసిరకం సీడ్‌ కష్టాలు సాక్షి ప్రతినిధి, బాపట్ల: సీడ్‌ కంపెనీలు రైతుల వద్ద డబ్బులు తీసుకొని నాసిరకం రొయ్య సీడ్‌ సరఫరా చేస్తుండడంతో దిగుబడులు తగ్గి తీవ్రంగా నష్టపోతున్నారు. ఏటా నాణ్యమైన సీడ్‌ అందిస్తామని కంపెనీలు చెబుతున్నప్పటికీ అమలుకు నోచుకోవడంలేదు. కంపెనీలపై నియంత్రణ లేకపోవడం, రైతులను వంచించినా.. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం లాంటి కారణాలతో తీవ్రంగా నష్టపోవలసివస్తోంది. జిల్లాలో అధికంగా సాగు చేస్తున్న బ్లాక్‌ టైగర్‌, వెనామీ తదితర రొయ్యలసీడ్‌ చాలావరకు నాసిరకంగా ఉంటోందని రైతులు ఆరోపిస్తున్నారు. ఫిబ్రవరి రెండవవారం నుంచి బాపట్ల జిల్లాతో పాటు ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున రొయ్యల సాగుకు రైతులు సిద్ధమయ్యారు. బాపట్ల జిల్లాలో దాదాపు 40 వేల ఎకరాలు సాగు చేస్తుండగా, ప్రకాశం జిల్లాలో 15 వేలు, నెల్లూరు జిల్లాలో 50 వేల ఎకరాల చొప్పున మూడు దక్షిణ కోస్తా జిల్లాల్లో లక్ష ఎకరాల్లో రొయ్యల సాగు జరగనుంది. ఇందులో 80 వేల ఎకరాల్లో( 80శాతం) బ్లాక్‌ టైగర్‌ రకం ,మిగిలిన 20 వేల ఎకరాల్లో వెనామీ సాగు కానుంది. మూడు జిల్లాల పరిధిలో మొత్తం లక్ష ఎకరాల సాగుకు 960 కోట్ల రొయ్యపిల్లలు అవసరం కాగా 80 వేల ఎకరాల బ్లాక్‌ టైగర్‌ రొయ్య సాగుకు ఎకరాకు 70 వేల సీడ్‌ చొప్పున మొత్తం 560 కోట్ల రొయ్యపిల్లలు అవసరం. ఒక్క బాపట్ల జిల్లాలో 40 వేల ఎకరాల సాగుకు 30 వేల ఎకరాల్లో బ్లాక్‌ టైగర్‌ అనుకుంటే 210 కోట్ల సీడ్‌ అవసరముంది. ఇక మొత్తం మూడు జిల్లాల పరిధిలో 20 వేల ఎకరాల వెనామీ సాగుకు ఎకరాకు 2 లక్షల సీడ్‌ చొప్పున మొత్తం 400 కోట్ల పిల్లలు అవసరముంది. రెండు నెలల్లోనే ఈ మొత్తం సీడ్‌ అవసరం కావడంతో 50 శాతంకు పైగా నాసిరకం సరఫరా చేస్తారని రైతులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి యూనిబై కంపెనీ ఒక్కటే బ్లాక్‌ టైగర్‌ రొయ్యసీడ్‌ సరఫరా చేస్తుంది. అడగాస్కర్‌ దేశం నుంచి తల్లి రొయ్యలు దిగుమతి చేసుకొని మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న 15 యాచరీస్‌లలో పిల్లలను ఉత్పత్తిచేసి రైతులకు సరఫరా చేస్తున్నారు. వాస్తవానికి ఒక్కొక్క రొయ్యపిల్ల తయారీకి కేవలం 30 పైసలు ఖర్చుఅవుతుంగా ప్రస్తుతం బ్లాక్‌ టైగర్‌ సీడ్‌కు ఒక్కొక్క పిల్లకు 99 పైసలు వసూలు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. సీడ్‌ ధర పెంచుకున్న కంపెనీలు నాణ్యమైన సీడ్‌ ఇవ్వాలన్నది రైతుల డిమాండ్‌. సీడ్‌ నాణ్యంగా లేకపోతే దిగుబడులు పడిపోయే పరిస్థితి ఉంటుంది.

న్యూస్‌రీల్‌

సర్టిఫైడ్‌ సీడ్‌ కోసం డిమాండ్‌

30 పైసలు ఖర్చుతో ఉత్పత్తి చేస్తున్న ఒక్క రొయ్య పిల్లకు దాదాపు రూపాయి చెల్లిస్తున్నందున బ్లాక్‌ టైగర్‌ సీడ్‌కు నాణ్యమైన సీడ్‌ అంటూ సర్టిఫికెట్‌ ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. గత ఏడాది రైతు నాయకులు ఒంగోలు కలెక్టర్‌ కార్యాలయంలో జేసీతో సమావేశమై ఇదే విషయంపై చర్చించగా .. రూపాయి తీసుకుంటున్నప్పుడు నాణ్యమైన సీడ్‌ అని సర్టిఫికెట్‌ ఎందుకు ఇవ్వరని ఆయన కంపెనీని ప్రశ్నించారు.? ఇవ్వాలని ఆదేశించారు. కానీ ఒకరిద్దరు రైతులకు మాత్రమే సర్టిఫికెట్‌ ఇచ్చినా యూనిబై కంపెనీ మిగిలిన రైతులకు సర్టిఫికెట్‌ ఇవ్వలేదు. సర్టిఫికెట్‌ అడిగిన వారికి సీడ్‌ లేదని చెప్పి కంపెనీలు రైతులను ఇబ్బందిపెట్టినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం అటువంటి వారిపై చర్యలకు దిగి నాణ్యతతో కూడిన సీడ్‌ ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం అధికారుతో ఒక కమిటీని వేసి సీడ్‌ పంపిణీ వ్యవహారాన్ని పర్యవేక్షించాలని రైతు నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఒక్క బ్లాక్‌ టైగర్‌ విషయంలోనే కాక వెనామీ ఇతర కంపెనీల సీడ్‌ పంపిణీ విషయంలోనూ ప్రభుత్వం పర్యవేక్షణ చేసి రైతులు నష్టపోకుండా చూడాలి. రైతులు అందరూ ఏకతాటిపైకి వచ్చి సీడ్‌ కంపెనీలు సర్టిఫికెట్‌ ఇచ్చేలా ఒత్తిడి పెంచాల్సి ఉంది.

పులిచింతల సమాచారం

బాపట్ల
ఆదివారం శ్రీ 25 శ్రీ జనవరి శ్రీ 2026

రొయ్యల సాగులో నో సర్టిఫైడ్‌...

ఒక్క రొయ్య పిల్లకు

రూ. 99 పైసలు వసూలు చేస్తున్న

యూనిబై యాచరీస్‌ కంపెనీ

నాసిరకం కాకుండా సర్టిఫైడ్‌ సీడ్‌

ఇవ్వాలంటున్న రైతులు

ప్రభుత్వం జోక్యం చేసుకొని రైతులకు

నష్టం జరగకుండా చూడాలని వినతి

సర్టిఫైడ్‌ అడిగితే సీడ్‌ ఇవ్వక

ఇబ్బంది పెడుతున్న కంపెనీలు

ఫిబ్రవరి నుంచి సాగు మొదలు

ప్రకాశం, నెల్లూరు, బాపట్ల ఉమ్మడి

జిల్లాల్లో లక్ష ఎకరాల్లో రొయ్యసాగు

నాసిరకం సీడ్‌ పై ఆందోళన

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 37.4116 టీఎంసీలు.

నాసిరకం సీడ్‌ కష్టాలు 1
1/4

నాసిరకం సీడ్‌ కష్టాలు

నాసిరకం సీడ్‌ కష్టాలు 2
2/4

నాసిరకం సీడ్‌ కష్టాలు

నాసిరకం సీడ్‌ కష్టాలు 3
3/4

నాసిరకం సీడ్‌ కష్టాలు

నాసిరకం సీడ్‌ కష్టాలు 4
4/4

నాసిరకం సీడ్‌ కష్టాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement