అథ్లెటిక్స్ ఓవరాల్ చాంపియన్ నెల్లూరు
ముగిసిన ఏపీ స్టేట్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్–2025 పోటీలు రెండవ రోజూ అదే ఉత్సాహాన్ని ప్రదర్శించిన వెటరన్ క్రీడాకారులు అతిథుల చేతుల మీదుగా విజేతలకు బహుమతుల ప్రదానం
ప్రత్తిపాడు: వెటరన్ క్రీడాకారులు రెండో రోజూ అదే ఉత్సాహాన్ని కనబరిచారు. పెదనందిపాడు మండలం పాలపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏపీ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్‌న్ ఆధ్వర్యంలో జరుగుతున్న 45వ రాష్ట్రస్థాయి వెటరన్‌న్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్–2025 పోటీలు ఆదివారం రాత్రితో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా పోస్టల్ అండ్ ఆర్‌ఎంఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ నిమ్మగడ్డ నాగేశ్వరరావు, శ్రీ హాస్పిటల్ అధినేత చెరుకూరి పవన్‌కుమార్‌లు హాజరయ్యారు. విజేతలకు గోల్డ్, సిల్వర్, బ్రౌంజ్ మెడల్స్‌తోపాటు, మెమోంటోలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. విజేతలుగా నిలిచిన క్రీడాకారులు ఫిబ్రవరి 13, 14, 15 తేదీల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జమ్మలపూర్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు ఏపీ మాస్టర్స్ అథ్లెటిక్స్ జనరల్ సెక్రటరీ మంగా వరప్రసాద్ తెలిపారు.
విజేతల వివరాలు..
రెండో రోజు పోటీల్లో విజేతలుగా నిలిచిన వారి వివరాలను ఏపీఎంఏ జనరల్ సెక్రటరీ డాక్టర్ మంగా వరప్రసాద్, వెటరనన్ అథ్లెటిక్స్ అసోసియేషన్‌న్ జిల్లా సెక్రటరీ గణేశుని రాంబాబు, జాయింట్ సెక్రటరీ చెన్నుపాటి శివనాగేశ్వరరావు వెల్లడించారు. 5కె రన్నింగ్ పురుషుల 65 ప్లస్ విభాగంలో కృష్ణా జిల్లాకు చెందిన వి.సుధాకర్, 70 ప్లస్ విభాగంలో విశాఖపట్నంకు చెందిన ఎం. శంకరరావులు ప్రథమ స్థానం సాధించారు. మహిళల 5కె రన్నింగ్ 60 ప్లస్ విభాగంలో నెల్లూరు జిల్లాకు చెందిన పి.కోటేశ్వరమ్మ, కె.శారదలు ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. 1కెఎం వాక్ 90 ప్లస్ విభాగంలో డి.శేషగిరిరావు (గుంటూరు), 3కె వాక్ 70 ప్లస్‌లో బి.వెంకటలక్ష్మిలు ప్రథమ స్థానం సాధించారు. 481 పాయింట్లతో నెల్లూరు జిల్లా ఓవరాల్ చాంపియన్‌షిప్, 431 పాయింట్లుతో విశాఖ జిల్లా రన్నర్స్‌గా నిలిచింది. బెస్ట్ మార్చ్‌ఫాస్ట్ వైజాగ్ ప్రథమ స్థానం, కృష్ణా జిల్లా ద్వితీయ స్థానం దక్కించుకుంది. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా కె.శ్రీనివాసరావు, ఇస్మాయిల్, రాఘవరావు, కృపారావు, అనిల్, ఎం.సత్యనారాయణలు వ్యవహరించారు.
అథ్లెటిక్స్ ఓవరాల్ చాంపియన్ నెల్లూరు
అథ్లెటిక్స్ ఓవరాల్ చాంపియన్ నెల్లూరు


