ఖోఖో బాలబాలికల జిల్లా జట్ల ఎంపిక
నకరికల్లు: ఉమ్మడి గుంటూరు జిల్లా ఖోఖో అసోసియేషన్ పల్నాడు జిల్లా ఖోఖో జట్టు సెలక్షన్స్ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించారు. ఉత్కంఠభరితంగా సాగిన సెలక్షన్స్‌ను గుంటూరు జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు వీరభద్రారెడ్డి, కార్యదర్శి చింతా పుల్లయ్య, ట్రెజరర్ జి.ఝాన్సీరాణి పర్యవేక్షించారు. సుమారు 200 మందికి పైగా బాలబాలికలు సెలక్షన్స్‌కు హాజరు కాగా బాలబాలికల్లో సీనియర్స్, జూనియర్స్ విభాగాల్లో సెలక్షన్స్ నిర్వహించారు. ఒక్కో జట్టుకు 19 మంది చొప్పున క్రీడాకారులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి చింతా పుల్లయ్య మాట్లాడుతూ పల్నాడు జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు ఈనెల 19వ తేదీ నుంచి 21వరకు జె.పంగులూరులోను, 24వ తేదీ నుంచి 26 వరకు గుడివాడలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని అన్నారు. జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులకు పలువురు అభినందనలు తెలిపారు.
చిలకలూరిపేట: ఏరా శ్రీను.. ఎలా ఉన్నావు... పిల్లలు, కుటుంబ సభ్యులు అందరూ క్షేమమా అంటూ కాంతారావు పలకరింపు. బాగానే ఉన్నాను.. మీ పిల్లలు అంతా సెటిల్ అయ్యారా అంటూ శ్రీనివాసరావు ప్రతి పలకరింపు. 50 ఏళ్ల తర్వాత కలసిన మిత్రుల మధ్య భావోద్వేగ సన్నివేశమిది. చిలకలూరిపేట ఆర్‌వీఎస్ సీవీఎస్ హైస్కూల్‌లో 1974– 75 టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఆదివారం పాఠశాల ప్రాంగణంలో జరిగింది. 50 ఏళ్ల కిందట ఇక్కడ చదువుకుని.. వివిధ ప్రాంతాలలో స్థిర పడిన పూర్వ విద్యార్థులు ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. స్కూల్ ప్రాంగణంలో తిరుగుతూ నాడు తాము చేసిన అల్లరి తలుచుకుంటూ, తరగతి గదులను పరిశీలించి ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. చిన్న పిల్లల తరహా సందడి చేశారు. ఆత్మీయ ఆలింగనాలు చేసుకుంటూ తమకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులను తలుచుకున్నారు. నాడు పాఠాలు బోధించిన గురువులు ప్రతాప వెంకట సుబ్రమణ్యశాస్త్రి, చిట్టిపోతు పట్టాభిరామారావు, ఎన్ వెంకట సుబ్బారావులను ఘనంగా సన్మానించారు. ఒకరికొకరు కొసరికొసరి వడ్డించుకుంటూ భోజనాలు చేశారు. సాయంత్రం బరువెక్కిన హృదయాలతో వీడ్కోలు చెప్పుకున్నారు. 1975లో స్కూల్ ఎస్‌పీఎల్‌గా వ్యవహరించిన డీఎల్ కాంతారావు, పూర్వ విద్యార్థులు కందిమళ్ల రాంబాబు, కృష్ణమూర్తి, నాగరాజు, చంద్రశేఖరరావు, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.
ఖోఖో బాలబాలికల జిల్లా జట్ల ఎంపిక
ఖోఖో బాలబాలికల జిల్లా జట్ల ఎంపిక


