రైతన్నా.. మిగిలింది మోసమే! | - | Sakshi
Sakshi News home page

రైతన్నా.. మిగిలింది మోసమే!

Dec 5 2025 6:44 AM | Updated on Dec 5 2025 6:44 AM

రైతన్

రైతన్నా.. మిగిలింది మోసమే!

రైతన్నా.. మిగిలింది మోసమే! ● కార్యక్రమాన్ని మొక్కుబడిగా నిర్వహించిన చంద్రబాబు సర్కార్‌ ● పంట కొనుగోలులో నిర్లక్ష్యం, మద్దతు ధర కల్పించకపోవడంతో వ్యతిరేకత ● ఎరువుల కొరత, తుపాను వేళ నష్టపరిహారం అందక అన్నదాతల ఆగ్రహం ● క్షేత్రస్థాయికి వెళ్లలేక కార్యక్రమానికి దూరంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ● సాగును తీవ్ర నిర్లక్ష్యం చేసి ఆర్భాటపు కార్యక్రమాలతో పాలకుల హడావుడి సాక్షి ప్రతినిధి, బాపట్ల: చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన ‘రైతన్నా.. నీకోసం’ కార్యక్రమం పెద్ద మోసమని రైతులకు అర్థమైపోయింది. జిల్లాలో కార్యక్రమం నామమాత్రంగా సాగింది. ప్రజల తలసరి ఆదాయాన్ని రూ. 55 లక్షలకు, వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధిరేటును 15 శాతానికి పెంచి రానున్న అయిదు సంవత్సరాల్లో రైతును రాజును చేసే కార్యాచరణ అంటూ చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో అబాసుపాలైంది. ఇప్పటికే ప్రభుత్వ తీరుతో తీవ్రంగా నష్టపోయి ఆగ్రహంతో ఉన్న రైతుల వద్దకు వెళ్లే ధైర్యం లేక మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. జిల్లా స్థాయి అధికారులు ఒకట్రెండు చోట్ల పాల్గొన్నారు. వారికీ రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తాము పండించిన శనగలను కొనేవారు లేరని, పంటను ఏం చేసుకోవాలని బుధవారం జె.పంగులూరు మండలం చందలూరులో జరిగిన ‘రైతన్నా.. నీ కోసం’ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌ను గ్రామానికి చెందిన పలువురు రైతులు నిలదీశారు. అధికారులు వచ్చి ఏ పంటలు వేయాలో చెబుతున్నారు, పండించిన పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకునే మార్గం మాత్రం చెప్పడం లేదని రైతులు సుబ్బారావు, మరికొందరు కలెక్టర్‌ సమక్షంలో మిగిలిన అధికారులపై మండిపడ్డారు. దీంతో వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో కార్యక్రమానికి రైతులను పిలవలేదు. గ్రామానికి వెళ్లి అక్కడున్న టీడీపీ నాయకుడి ఇంట్లో కూర్చొని ఒకరిద్దరు రైతులను పిలిపించి ఫ్లెక్సీ పెట్టి ఫొటోలు దిగారు. కరపత్రాలు పంచి చేతులు దులుపుకొన్నారు. రైతులను భాగస్వాములను చేస్తే సమస్యలపై నిలదీస్తారని అధికారులు వారినే దూరం పెట్టడం చర్చనీయాంశమైంది. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉండగా, గొట్టిపాటి రవికుమార్‌ మాత్రమే కార్యక్రమంలో పాల్గొన్నారు. సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు సభలో రైతులు మంత్రికి సమస్యలు ఏకరువు పెట్టారు. ఈనాం భూములకు కొందరికి మాత్రమే అన్నదాత సుఖీభవ ఇచ్చారని, మిగిలిన వారికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అర్జీలు పెట్టుకుంటే అందరికీ ఇప్పిస్తానని మంత్రి సమస్యనుంచి తప్పించుకోవాల్సి వచ్చింది. మంత్రి, కలెక్టర్‌ పాల్గొన్న సభల్లోనే రైతులు నిలదీశారంటే అధికారులు పాల్గొన్న సమావేశాల్లో ఏ స్థాయిలో నిలదీతలు ఉండేవో అర్థం చేసుకోవచ్చు. అందుకే జిల్లాలో ఎక్కడా రైతులను భాగస్వాములను చేయలేదు. గత నెల 24 నుంచి నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లాలో 1,65,769 రైతు కుటుంబాలకు అవగాహన కల్పించినట్లు కాకి లెక్కలు రాశారు. రైతులకు నీటి కార్యాచరణ, డిమాండ్‌ ఆధారిత పంటలు, అగ్రిటెక్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ప్రభుత్వ మద్దతు అనే అంశాలతో కూడిన కరపత్రాలు ముద్రించి మండలాలకు పంపించారు. చాలాచోట్ల అవి కూడా రైతులకు అందించిన పాపాన పోలేదు. మరోవైపు ప్రత్యేక యాప్‌ ద్వారా రైతులకు అవగాహన కల్పించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కార్యక్రమం ఎలా జరిగిందని రైతులను ప్రశ్నిస్తే... చాలామంది ‘ఆ కార్యక్రమం సంగతే తమకు తెలియదని’ చెబుతున్నారు. ఎన్నికల ముందు లెక్కలేనన్ని హామీలు ఇచ్చిన చంద్రబాబు... అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కారు. పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో 80 వేల టన్నుల పొగాకు పండిస్తే కంపెనీలు కొనలేదు. ప్రభుత్వం మొక్కుబడిగా కొని ముఖం చాటేసింది. మిర్చికి మద్దతు ధరలేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. పత్తి, మొక్కజొన్నదీ అదే పరిస్థితి. దాదాపు 7 లక్షల టన్నుల ధాన్యం పండిస్తే గత ఏడాది 90 వేల టన్నులు కూడా ప్రభుత్వం మద్దతు ధరకు కొనలేదు. ఈ ఏడాదీ అదే పరిస్థితి. బయట మార్కెట్‌లో బస్తా రూ. 1,300కు కూడా కొనేవారు లేరు. పెట్టుబడి సంగతి దేవుడెరుగు.. కౌలు నగదు కూడా వచ్చే పరిస్థితి లేక రైతులు విలవిల్లాడుతున్నారు. కౌలు రైతులకు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ఇవ్వలేదు. పంటల బీమా ఊసు కూడా లేదు. ఇన్‌పుట్‌ అందించలేదు. రైతులకు అండగా నిలిచిన ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. విత్తనాలు, ఎరువులు దొరకడం గగనమైంది.

జగనన్న హయాంలో పండుగలా..

అన్నదాతల ఆగ్రహం

నిలదీసిన రైతులు

కాకి లెక్కలకే పరిమితం

ధాన్యానికి ధర లేక నష్టపోయా

10 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశా. ప్రభుత్వం మద్దతు ధర బస్తాకు రూ.1,792 ఇస్తామని చెప్పడంతో ఆశపడ్డాం. తీరా చూస్తే అసలు కొనలేదు. ఒకపక్క మబ్బుల భయం. తడిస్తే ధాన్యం పనికిరాదు. ఏం చేయాలో పాలుపోక బస్తా రూ.1,250 చొప్పున 200 బస్తాలు దళారులకు అమ్ముకొన్నా. పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. వైఎస్‌ జగన్‌ పాలనలో బస్తా రూ.1,900కు విక్రయించా.

పొగాకు కొంటామని ప్రభుత్వం దగా

నాలుగు ఎకరాల్లో బర్లీ పొగాకు సాగు చేశా. ఎకరాకు రూ. 1.5 లక్షల చొప్పున రూ. 6 లక్షలు పెట్టుబడి పెట్టా. 50 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. వ్యాపారులు పొగాకు కొనేందుకు ముందుకు రాలేదు. ప్రభుత్వం మార్కెఫెడ్‌ ద్వారా కొంటామని చెప్పినా క్వింటా రూ. 6 వేల వంతున 20 క్వింటాళ్లు తీసుకుంది. మిగతాది కొనలేదు. దీంతో మిగిలిన పొగాకు అమ్ముకోలేక తీవ్రంగా నష్టపోయా.

వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం అన్ని పంటలకు మద్దతు ధర కల్పించింది. బయట మార్కెట్‌లో కూడా గిట్టుబాటు ధరలు నిలకడగా ఉండేలా చూసింది. రైతు భరోసా అందించింది. ఆర్బీకేలు పెట్టి రైతులకు అండగా నిలిచింది. ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చింది. వ్యవసాయాన్ని పండుగలా మార్చింది.

అన్నదాతకు అండ కరువైంది. చంద్రబాబు పాలన ఆర్భాటాలకే పరిమితమైంది. విత్తనాలు, ఎరువుల కరువు నుంచి కనీసం దక్కని మద్దతు ధర వరకు అన్నింటా అన్నదాతలు నిండా మునిగారు. వారిని మభ్యపెట్టేందుకు రైతన్నా.. నీకోసం అంటూ ఓ కార్యక్రమం చేపట్టిన సర్కారు.. హడావుడికే పరిమితమైంది. పైగా ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న రైతులను గమనించిన అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు నామమాత్రంగా కార్యక్రమానికి హాజరయ్యారు. క్షేత్రస్థాయిలో వ్యతిరేకత చూసి ముఖం చాటేశారు. అధికారులు కూడా మమ అనిపించారు. రైతులను అక్కడక్కడ కలిసి కార్యక్రమం ముగించేశారు.

– అల్లూరు యోనా, జంపని, వేమూరు మండలం

– ముప్పాళ్ల రాఘవయ్య, పొగాకు రైతు, బోడవాడ, పర్చూరు మండలం

రైతన్నా.. మిగిలింది మోసమే! 1
1/3

రైతన్నా.. మిగిలింది మోసమే!

రైతన్నా.. మిగిలింది మోసమే! 2
2/3

రైతన్నా.. మిగిలింది మోసమే!

రైతన్నా.. మిగిలింది మోసమే! 3
3/3

రైతన్నా.. మిగిలింది మోసమే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement