మతిస్థిమితం లేని మహిళ అదృశ్యం
జె.పంగులూరు: మతి స్థిమితం లేని మహిళ నాలుగు రోజుల నుంచి కనబడటం లేదని మండలంలోని బైటమంజులూరు గ్రామస్తులు గురువారం తెలిపారు. బైట మంజులూరు గ్రామానికి చెందిన సరికొండ ఆదిరాజు భార్య సరికొండ కొండమ్మ వయస్సు 54 సంవత్సరాలు ఉంటాయని తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా మతిస్థిమితం లేక చుట్టు పక్కల గ్రామాలు అయిన భగవాన్ రాజుపాలెం, ముప్పవరం పరిసర ప్రాంతాల్లో తిరిగి సాయంత్రానికి ఇంటికి వస్తూ ఉండేది. నాలుగు రోజుల నుంచి ఆమె కనపడటం లేదని గ్రామస్తులు తెలిపారు. గురువారం రేణింగవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆచూకీ తెలిసిన వాళ్ళు 7093395116, 9581937968 నంబర్లకు తెలియజేయాలని కోరారు.


