బాలా త్రిపురసుందరికి ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

బాలా త్రిపురసుందరికి ప్రత్యేక పూజలు

Dec 5 2025 6:44 AM | Updated on Dec 5 2025 6:44 AM

బాలా

బాలా త్రిపురసుందరికి ప్రత్యేక పూజలు

బాలా త్రిపురసుందరికి ప్రత్యేక పూజలు పెదపులివర్రు(భట్టిప్రోలు): వ్యాఘ్రపుర క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన భట్టిప్రోలు మండలం పెదపులివర్రు గ్రామంలో కొలువైన శ్రీ బాలా త్రిపురసుందరీ సమేత శ్రీ రాజ రాజ నరేంద్ర స్వామి వారి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. లలితా సహస్ర నామార్చన సహిత కుంకుమార్చన అంగరంగ వైభవంగా జరిగింది. సువాసినులందరికి పసుపు, కుంకుమ, చీరసారె, ఫల తాంబూలాలు అందచేశారు. అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తొమ్మిది స్క్రబ్‌ టైఫస్‌ కేసులు నమోదు గుంటూరు మెడికల్‌: గుంటూరు జీజీహెచ్‌లో స్క్రబ్‌ టైఫస్‌ పాజిటివ్‌ కేసులు తొమ్మిది నమోదయ్యాయి. జిల్లాలోని మేడికొండూరు మండలం వరగాని చెందిన మహిళ (41), గుంటూరు ఏటీ అగ్రహారంనకు చెందిన మహిళ (55), పెదనందిపాడు మండలం కొప్పుర్రుకు చెందిన మహిళ (69), గుంటూరు రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన యువకుడు (28), గుంటూరు శ్యామలానగర్‌కు చెందిన మహిళ (33), గుంటూరు దాసరిపాలెంకు చెందిన వృద్ధురాలు (73), పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడికి చెందిన మహిళ (54), ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన మహిళ (36), కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండకు చెందిన మహిళ (52) స్క్రబ్‌ టైఫస్‌ లక్షణాలతో గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. గుంటూరు జిల్లాలో ఇప్పటికే 31 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నూతనంగా వచ్చిన ఆరు కేసులతో బాధితుల సంఖ్య 37కు చేరుకుంది. డీడీవో కార్యాలయం ప్రారంభోత్సవం

తెనాలి అర్బన్‌: తెనాలి నాజర్‌పేటలో నూతనంగా ఏర్పాటు చేసిన డివిజనల్‌ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని గురువారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 77 డీడీవో కార్యాలయాలను ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ప్రారంభించడం జరిగిందన్నారు. జిల్లా పరిషత్‌ సీఈవో జ్యోతిబస్‌, ఎంపీడీవో అత్తోట దీప్తి, తహసీల్దార్‌ గోపాలకృష్ణ, తెనాలి డీడీవో కుసుమ శ్రీదేవి మాట్లాడారు. తెనాలి డీడీవో పరిధిలో తెనాలి, పొన్నూరు, చేబ్రోలు, కాకుమాను, తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల, కొల్లిపర మండలాలతో పాటు గ్రామ సచివాలయాలు ఉంటాయన్నారు.

లారీని ఆటో ఢీకొని డ్రైవర్‌ మృతి

అద్దంకి రూరల్‌: ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టడంతో డ్రైవర్‌ మృతి చెందిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున అద్దంకి– నార్కెట్‌పల్లి నామ్‌ రహదారిపై చోటు చేసుకుంది. ఎస్సై తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని మణికేశ్వరం గ్రామానికి చెందిన మురికిపూడి పున్నయ్య (57) పాలు తీసుకెళ్లే ఆటో నడుపుతున్నాడు. సూర్యామిల్క్‌ డెయిరీకి వెళ్లి పాలు ఇచ్చి తిరిగి ఇంటికి వస్తుండగా మార్గ మధ్యలోని చక్రాయపాలెం గ్రామ సమీపంలోకి రాగానే రోడ్డు పక్కన లారీకి ఎటువంటి సిగ్నల్‌ లైట్లు లేకుండా నిలిపి ఉండటంతో ఆటో ఢీకొట్టింది. దీంతో పున్నయ్యకు తీవ్ర గాయలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. పున్నయ్యకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. అద్దంకి ఎస్సై పి.వెంకటేశ్వరరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బాలా త్రిపురసుందరికి  ప్రత్యేక పూజలు 1
1/3

బాలా త్రిపురసుందరికి ప్రత్యేక పూజలు

బాలా త్రిపురసుందరికి  ప్రత్యేక పూజలు 2
2/3

బాలా త్రిపురసుందరికి ప్రత్యేక పూజలు

బాలా త్రిపురసుందరికి  ప్రత్యేక పూజలు 3
3/3

బాలా త్రిపురసుందరికి ప్రత్యేక పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement