బాపట్ల
న్యూస్‌రీల్
వైఎస్ జగన్ హయాంలో భేష్
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ధాన్యం తడిసినా ఇతరత్రా కారణాలతో పాడైనా ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనేది. వర్షాల సమయంలో రైతులకు టార్పాలిన్ పట్టలు అందజేసింది. బయట మార్కెట్‌లోనూ అన్ని పంటల ధర మద్దతు ధర అంత ఉండేది. వరి ధాన్యం రూ. 2 వేలు అమ్మింది. మిర్చి క్వింటా రూ. 20 వేలు, పొగాకు రూ. 18 వేలకు విక్రయించారు. అన్ని రకాల ధాన్యం, ఇతర పంటల ధరలు రైతులకు గిట్టుబాటు కల్పించాయి.
ఎంపీ సమాధానం చెప్పాలి
సాగర్ నీటిమట్టం
పులిచింతల సమాచారం
పశ్చిమ డెల్టాకు నీటి విడుదల
పీజీ ఫలితాల్లో కీర్తికి రాష్ట్ర ప్రథమ ర్యాంక్
గురువారం శ్రీ 27 శ్రీ నవంబర్ శ్రీ 2025
గుంటూరు లీగల్ : ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి బుధవారం గుంటూరు జిల్లా కోర్టులో న్యాయవాదులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. కౌన్సిల్ మెంబర్‌గా పోటీ చేస్తున్న హైకోర్టు అడ్వకేట్ కొమ్మసాని శ్రీనివాసరెడ్డి గుంటూరు విచ్చేశారు. జిల్లా కోర్టులో న్యాయవాదులను కలిసి తన అభ్యర్థిత్వాన్ని బలపరిచి గెలిపించాలని కోరారు. న్యాయవాదులు పెద్ద సంఖ్యలో ఆయన వెంట ఉన్నారు.
తెనాలి: జనబాహుళ్యం వైదిక మార్గాన్ని అనుసరించినప్పుడే లోకానికి హితం చేకూరుతుందని జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠాధిపతులు శ్రీవిద్యాశంకర భారతీస్వామి స్పష్టం చేశారు. పట్టణ నాజరుపేటలోని విద్యాశంకర భారతి నృసింహ సదనాన్ని బుధవారం భారతీస్వామి సందర్శించారు. వేదిక్ బ్రాహ్మణ సేవాసమాఖ్య పర్యవేక్షణలో నిర్మించిన నృసింహ సదనాన్ని సందర్శించాక, సంతోషం వ్యక్తం చేశారు. భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు. ధార్మిక ప్రచారకర్త అబ్బూరి వెంకాయమ్మ పీఠానికి రాసిచ్చిన స్థలాన్ని నృసింహ సదనానికి ఇచ్చినట్టు తెలిపారు. సమాఖ్య అధ్యక్షులు అమ్మన్ని సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి, తాడేపల్లి నాగ సుబ్రహ్మణ్యం, కుందేటి సుబ్రహ్మణ్యం కామేశ్వరరావు, తాడేపల్లి శివకుమార్, నందివెలుగు విజయసారథి, మేడూరి శ్రీనివాసమూర్తి, దీవి లక్ష్మీ నరసింహాచార్యులు, దీవి జీవన్‌కుమార్ పాల్గొన్నారు.
7
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం
ఆరు రోజులుగా జిల్లాలో మబ్బులు
వేమూరు, రేపల్లెల్లో 40 వేల
ఎకరాల్లో కోతలు
రోడ్లపైనే ధాన్యం ఆరబెడుతున్న రైతులు
మొక్కుబడిగా కూడా ధాన్యం
కొనని చంద్రబాబు ప్రభుత్వం
వర్షం వస్తే తీవ్ర నష్టం తప్పదని
అన్నదాతల ఆందోళన
ఇప్పటికే మోంథా తుపానుతో
నష్టపోయిన రైతులు
జెడ్పీటీసీల ప్రమేయం లేకుండా రూపొందించిన ఆర్థిక సంవత్సర బడ్జెట్ ఆమోదం పొందకుండా తాము ఆరు నెలలపాటు అడ్డుకున్నామని తెలిపారు. అయితే జెడ్పీటీసీలకు తెలియకుండా ఎటువంటి పనులు ఆమోదం పొందవని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చిన హామీతో తాము సర్వసభ్య సమావేశపు అజెండాను ఆమోదించామని తెలిపారు. కానీ ఇప్పుడు మళ్లీ పాత పద్ధతిలోనే ఏకపక్షంగా పనులు ఆమోదింప చేసుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తమకు సమాధానం చెప్పాలన్నారు. కమీషన్లు తీసుకుని పనులు ఆమోదిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. జెడ్పీని సొంత జాగీరుగా మార్చుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. జెడ్పీలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా పరిపాలన కొనసాగుతోందని ఆరోపించారు. ఈ సమావేశంలో కందుల సిద్ధయ్య, సంకటి నాగమల్లేశ్వరి, షేక్ గుల్జార్ బేగం, మూలగొండ్ల కృష్ణకుమారి, తుమ్మల సుబ్బారావు, తుమ్మా విజయప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 582.20 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 11,856 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2వేల క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు అంతే వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 42.1600 టీఎంసీలు.
దుగ్గిరాల: విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నుంచి పశ్చిమ డెల్టాకు 3,422 క్యూసెక్కులు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటి మట్టం ఉంది.
వాన రూపంలో పొంచి ఉన్న ప్రమాదంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వరి కోతలు మొదలై ధాన్యం ఆరబెట్టుకుంటున్న ఈ తరుణంలో చినుకు ఎప్పుడు పడుతుందోనని వణుకుతున్నారు. చంద్రబాబు సర్కారు ధాన్యం సరిగా సేకరించకపోవడం, కొన్న కొద్ది ధాన్యం విషయంలోనూ అడ్డగోలు కొర్రీలు పెట్టడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
గుంటూరు మెడికల్: గుంటూరు జిల్లాలోని కాటూరి మెడికల్ కాలేజ్ సామాజిక వైద్య విభాగం పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ వేమూరి కీర్తికి పరీక్ష ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ లభించింది. ఈ మేరకు బుధవారం కళాశాల యాజమాన్యం ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించింది. పీజీ పరీక్షా ఫలితాల్లో 800 మార్కులకుగాను డాక్టర్ వి.కీర్తికి 594 మార్కులు వచ్చాయని కళాశాల యాజమాన్యం తెలిపింది. కమ్యూనిటీ మెడిసిన్‌లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన డాక్టర్ కీర్తికి కళాశాల చైర్మన్ కాటూరి సుబ్బారావు, డైరెక్టర్ డాక్టర్ స్వైరారావు, డీన్ డాక్టర్ సి.హెచ్.మోహన్‌రావు, ప్రిన్సిపాల్ డాక్టర్ జి.చైతన్యలు అభినందనలు తెలిపారు.
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల


