దేశాభివృద్ధికి రాజ్యాంగం కీలకం
బాపట్ల టౌన్: దేశాభివృద్ధికి రాజ్యాంగం ఎంతో కీలకమైనదని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్‌కుమార్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు సంతోషం, స్వేచ్ఛగా జీవించడానికి ప్రాథమిక హక్కులను రాజ్యాంగం కల్పించిందన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన భిన్నమై దేశం మనదని పేర్కొన్నారు. స్వేచ్ఛ, సమానత్వంతో ప్రతి పౌరుడు ముందుకు సాగాలన్నారు. రాజ్యాంగం విలువలను గుర్తించి పాటించడం శుభ పరిణామమని జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం తెలిపారు. మాక్ అసెంబ్లీకి ఎంపికై న 10 మంది విద్యార్థులను పతకాలు, అవార్డులతో కలెక్టర్ సత్కరించారు. ఉపాధ్యాయుడు సాదిక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ శాఖ పాత్ర ముఖ్యం
రాజ్యాంగ పరిరక్షణలో పోలీస్ శాఖ పాత్ర కీలకమైనదని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వేచ్ఛకు, రక్షణకు, ప్రజా హక్కులను లిఖితపూర్వకంగా నిర్ధారిస్తూ, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారా ‘‘ప్రజలే సార్వభౌములు’’ అనే సూత్రాన్ని రాజ్యాంగం ప్రకటించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ వి. శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ పి. విజయసారథి, సీసీఎస్ డీఎస్పీ పి. జగదీష్ నాయక్, ఎ.రేపల్లె డీఎస్పీ ఎ. శ్రీనివాసరావు, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ జి. నారాయణ, డీసీసీఆర్బీ ఇన్‌స్పెపక్టర్ ఆర్. అహ్మద్ జానీ, అద్దంకి టౌన్ సీఐ ఎ. సుబ్బరాజు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
దేశాభివృద్ధికి రాజ్యాంగం కీలకం


