బైక్‌ను ఢీ కొన్న కారు..ఇద్దరికి తీవ్రగాయాలు
మేదరమెట్ల: రోడ్డు క్రాస్ చేస్తున్న మోటారు బైక్‌ను కారు ఢీకొనడంతో బైక్‌పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన కొరిశపాడు జాతీయరహదారి ఎమర్జెన్సీ ల్యాండింగ్‌పై బుధవారం చోటుచేసుకుంది. చిలకలూరిపేట మండలం గణపవరానికి చెందిన రోశయ్య మరో వ్యక్తితో కలిసి మోటారు బైక్‌పై వెళుతూ కొరిశపాడు మండలంలోని పి.గుడిపాడు సమీపంలో గల గాజు ఫ్యాక్టరీ వద్ద బైకును రోడ్డు క్రాస్ చేస్తున్నాడు. అదే సమయంలో విజయవాడ వైపు నుంచి బద్వేల్‌కు వెళుతున్న కారు మోటారు బైకును ఢీకొంది. ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా హైవే అంబులెన్స్‌లో ఒంగోలు కిమ్స్‌కు తరలించారు. మేదరమెట్ల ఎస్‌ఐ మహ్మద్ రఫీ ప్రమాద వివరాలను తెలుసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


