లిమ్కా రికార్డులో అఖిల్‌కు చోటు
సంతమాగులూరు (అద్దంకి రూరల్): కరాటే కిక్స్‌లో సత్తా చాటి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో సంతమాగులూరు మండలం వెల్లల చెరువు గ్రామానికి చెందిన గంటెనపాటి అఖిల్ చోటు దక్కించుకున్నారు. ఈ నెల 23న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన లిమ్కా బుక్ రికార్డులో అత్యధికంగా మాష్‌గిరి కిక్స్ 30 నిమిషాలు ఆపకుండా కిక్స్ కొట్టి రికార్డు సాధించినట్లు ఆర్గనైజర్ మిట్టల్ జయంత్ బుధవారం తెలిపారు. విశేష ప్రతిభ కనబర్చి లిమ్కా బుక్‌లో స్థానం పొందిన అఖిల్‌ను గ్రామస్తులు అభినందించారు.


