హైటెక్‌ వ్యభిచారం గుట్టు రట్టు | - | Sakshi
Sakshi News home page

హైటెక్‌ వ్యభిచారం గుట్టు రట్టు

Nov 7 2025 7:06 AM | Updated on Nov 7 2025 7:06 AM

హైటెక

హైటెక్‌ వ్యభిచారం గుట్టు రట్టు

హైటెక్‌ వ్యభిచారం గుట్టు రట్టు ఎస్‌ఐ, హెచ్‌సీ, పీసీ, హోంగార్డు సస్పెన్షన్‌ ఎల్‌ఎల్బీ రీవాల్యుయేషన్‌ ఫలితాలు విడుదల

ఆన్‌లైన్లో బుకింగులు ఇంట్లో వ్యవహారాలు

యడ్లపాడు: ఆన్‌లైన్‌ వ్యభిచార దందా చేస్తున్న వారి గుట్టు పోలీసులు రట్టు చేశారు. ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న యువతుల ఆసరాలను అవకాశంగా తీసుకుని వారిని వ్యభిచార ఊబిలోకి దింపుతున్న నిర్వాహకురాలిపై నిఘా నిర్వహించారు. కొద్దికాలంగా రహస్యంగా వ్యభిచారం నిర్వహించే గృహంపై మెరుపుదాడి చేసి ఇద్దరు విటులతో పాటు నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకుని ఓ బాధితురాలిని కాపాడారు. రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో గురువారం యడ్లపాడు ఎస్‌ఐ టి.శివరామకృష్ణతో కలిసి చిలకలూరిపేట రూరల్‌సీఐ బి.సుబ్బానాయుడు కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామానికి చెందిన ఓ మహిళ కొంతకాలం కిందట భర్తతో విడిపోయి విడిగా ఉంటోంది. అయితే ఆమె వ్యభిచార నిర్వహణను ఉపాధి మార్గంగా ఎంచుకుంది. యడ్లపాడు గ్రామంలోని 16వ జాతీయ రహదారి పక్కన పిల్లికొండ సమీపంలో నివాస వాసాలు పెద్దగా లేని ఓ ఇంటిని ఏర్పాటు చేసుకుంది. కొంతకాలంగా యువతుల ఫొటోలు పోస్ట్‌ చేసి విటులను ఆకర్షిస్తూ వ్యభిచారం నిర్వహిస్తోంది. విటులను ఫోన్‌ ద్వారా సంప్రదించడం, యువతుల ఫోటోలను వారికి వాట్సప్‌ ద్వారా పంపించడం.. నచ్చితే వెంటనే యూపీఐ ద్వారా నగదు పొందడం వంటి అన్ని కార్యాకలాపాలు హైటెక్‌ తరహాలో నిర్వహిస్తోంది. ఈ వ్యభిచార వ్యవహారంపై పోలీసులకు పక్కా సమాచారం రావడంతో గురువారం యడ్లపాడులోని వ్యభిచార గృహంపై పోలీసులు మెరుపుదాడి చేశారు. అక్కడ ఇద్దరు విటులను అదుపులోకి తీసుకుని ఓ బాధితురాలిని కాపాడారు. వారి నుంచి నిర్వాహకురాలి వివరాలు తెలుసుకుని చిలకలూరిపేట మండలం పసుమర్రులో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఫోన్‌ స్వాధీనం చేసుకుని మానవ అక్రమ రవాణా నిరోధక చట్టం కేసు నమోదు చేశారు.

నగరంపాలెం(గుంటూరు వెస్ట్‌) : జిల్లాలోని వేర్వేరు పోలీస్‌స్టేషన్లలో విధులు నిర్వర్తించే ఒక ఎస్‌ఐ, హెడ్‌ కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ , హోంగార్డులను సస్పెండ్‌ చేస్తూ జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నగరంపాలెం ఎస్‌ఐ షేక్‌.సలాం, హెచ్‌సీ బి.రమేష్‌, పెదకాకాని కానిస్టేబుల్‌ బి.సురేష్‌కుమార్‌, హోంగార్డు హరీష్‌ను సస్పెండ్‌ చేశామన్నారు. ఎస్‌ఐ, హెచ్‌సీలు అధి కారిక విధుల్లో ప్రైవేట్‌ వ్యక్తులను అనుమతించి, విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు వెల్లడైందని అన్నారు. ఇక బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వ్యక్తుల నుంచి రూ.3 వేలను కానిస్టేబుల్‌, హోంగార్డు తీసుకున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు.

ఏఎన్‌యూ(పెదకాకాని): వర్సిటీ పరిధిలో త్రీ ఇయర్స్‌ ఎల్‌ఎల్బీ 3వ సెమిస్టర్‌, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ 7వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షల రీవాల్యుయేషన్‌ ఫలితాలను విడుదల చేసినట్లు సీఐ ఆలపాటి శివ ప్రసాదరావు గురువారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. విద్యార్థులంతా చూసుకోవాలని ఆయన సూచించారు.

హైటెక్‌ వ్యభిచారం గుట్టు రట్టు 
1
1/1

హైటెక్‌ వ్యభిచారం గుట్టు రట్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement