
ఉత్కంఠభరితంగా జాతీయ చెస్ పోటీలు
చేబ్రోలు: ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజ్ఞాన్‌లో నిర్వహిస్తున్న 62వ జాతీయ చెస్ చాంపియన్‌షిప్–2025 పోటీలు సోమవారం రెండో రోజు ఉత్కంఠభరితంగా సాగాయి. 14 మంది గ్రాండ్‌మాస్టర్లు, 30 మంది ఇంటర్నేషనల్ మాస్టర్లు సహా మొత్తం 394 మంది పోటీ బరిలో నిలిచారు. తొలి రౌండ్‌లో ఎక్కువ మంది గ్రాండ్ మాస్టర్లు, ఇంటర్నేషనల్ మాస్టర్లు సునాయాస రెండో రౌండ్‌కి చేరుకున్నారు.
● రెండో సీడ్ సూర్యశేఖర్ గంగూలీ మొదటి రోజు సుదీర్ఘమైన గేమ్‌ను ఆడి, చివరికి తనదైన స్టైల్‌లో విజయం సాధించారు.
● రైల్వే జట్టుకు చెందిన గ్రాండ్‌మాస్టర్ దీపన్ చక్రవర్తి, ఐఎం సిద్ధాంత్ మోహాపాత్రా ప్రత్యర్థులతో పాయింట్లు పంచుకోవాల్సి వచ్చింది.
● పీఎస్‌పీబీకి చెందిన ఐఎం నిషా మొహోటా, తెలంగాణ ఆటగాడు మోక్షిత్ పసుపులేటి చేతిలో ఓటమి పాలయ్యారు.
● ఆంధ్రప్రదేశ్ అభిమాన ఆటగాడు, 2017 జాతీయ చాంపియన్ లలిత్ బాబు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గగన్ సహూను చాకచక్యంగా ఓడించారు.