
మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
బాపట్ల: మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సీఐటీయూ నాయకుడు శరత్ డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయం వద్ద అర్ధనగ్న మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. అనంతరం ప్రదర్శన చేపట్టారు. శరత్ మాట్లాడుతూ 15రోజులుగా వేతనాలు పెంచాలని, సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. బుధవారం చేపట్టిన చలో విజయవాడకి తరలిరావాలని కోరారు. జూలై 4నుంచి అత్యవసరాలు మంచినీళ్లు, విద్యుత్తు లాంటి విధు లు నిర్వహిస్తున్న కార్మికులు కూడా నిరవధిక సమ్మెలోకి వెళ్లి ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. ఇంజినీరింగ్ కార్మికులకు స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు అమలుచేయాలి, జీవో నెంబర్ 36 ప్రకారం రూ.24,500 వేతనం అమలుచేయాలని, తక్షణం తల్లికి వందనం ఇవ్వాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని, గత సంవత్సరం 17రోజుల సమ్మె ఒప్పందాలు అమలుచేయాలని డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు యూనియన్ నాయకులు రత్నం, నాని, అశోక్, బాపట్ల పట్టణ మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూని యన్ నాయకులు మురళీకృష్ణ, హరిబాబు, సాంబిరెడ్డి, ప్రమీల, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ నాయకులు శరత్