
నూతన బస్‌లను ప్రారంభించిన మంత్రులు
అద్దంకి: ఆర్టీసీ నూతన బస్సులను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, క్రీడా శాఖ మంత్రి ఎం.రాంప్రసాద్‌రెడ్డి మంగళవారం ప్రాంరంభించారు. విద్యుత్‌శాఖ మంత్రి మాట్లాడుతూ అద్దంకికి ఇప్పటి వరకూ 12 కొత్త బస్సులను ఇచ్చినట్లు చెప్పారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో లోక్ సభ ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్, కలెక్టర్ వెంటకమురళి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
విద్యుత్ విజిలెన్స్ దాడులు
వేటపాలెం: వేటపాలెంలో విద్యుత్ విజిలెన్స్ సిబ్బంది మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో విజిలెన్స్ డీఈ ఎం.భాస్కర్ వివరాలు వెల్లడించారు. విద్యుత్ సిబ్బంది 36 బృందాలుగా ఏర్పడి వేటపాలెం టౌన్ ప్రాంతంలో 3232 విద్యుత్ సర్వీసులను తనిఖీ చేశారు. తనిఖీల్లో అనుమతి తీసుకున్న దానికంటే ఎక్కువగా వాడుతున్న 66 మందికి రూ.2.35 లక్షలు అపరాధ రుసుం విధించారు. అనుమతించిన కేటగిరీలో కాకుండా మరొక కేటగిరీలో వాడుతున్న 12 మంది వద్ద రూ.10 వేల అపరాధ రుసుం వసూలు చేశారు. దాడుల్లో జిల్లా సూపరింటెండెంట్ ఇంజినీర్ గువ్వల ఆంజనేయులు, విజిలెన్స్ ఏడీ విజయ శ్రీనివాస్, చీరాల ఆపరేషన్ డివిజన్ డీఈ జాన్ థామస్, వేటపాలెం ఏడీ పెరుగు శ్రీనివాస్‌రావు, వేదవ్యాస్, చీరాల డివిజన్ ఏడీలు, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఏఎన్‌ఎంలకు బదిలీ కౌన్సెలింగ్
గుంటూరు మెడికల్: గుంటూరు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో మంగళవారం ఏఎన్‌ఎంలకు సాధారణ బదిలీల కౌన్సెలింగ్ జరిగింది. నాలుగు రోజుల కిందట నిర్వహించిన కౌన్సెలింగ్‌పై పలు ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చాయి. దీంతో తిరిగి జూమ్ ద్వారా కౌన్సెలింగ్ నిర్వహించారు. సుమారు 900 మందికి పైగా వార్డు సచివాలయ ఏఎన్‌ఎం గ్రేడ్–3 కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారు. ఈ పక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగింది.
కనుల పండువగా అమ్మవారికి సారె మహోత్సవం
బాపట్లటౌన్: పట్టణంలోని శృంగారపురంలో వేంచేసియున్న వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలోని గోవిందమ్మ అమ్మవారికి మంగళవారం పట్టణంలోని మహిళల ఆధ్వర్యంలో ఆషాఢ సారె సమర్పించారు. తొలుత పట్టణంలోని మహిళలు పుసుపు, కుంకుమ, పండ్లు, పూలు, చీరలు, గాజులు, సలిమిడి, వడపప్పుతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సారె సమర్పించారు. అనంతరం అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గురువులను పూజించాలి
అమరావతి: ప్రపంచాన్ని సన్మార్గంలో నడిపించి అందరికీ మార్గదర్శకంగా నిలిచే గురువు లను పూజించాలని భవఘ్నిగురూజీ అన్నారు. మండలంలోని వైకుంఠపురం భవఘ్ని ఆరామంలో గురిపూర్ణిమ మహోత్సవాల తొలిరోజు మంగళవారం కార్యక్రమాలను భక్తిప్రపత్తుల తో నిర్వహించారు. భవఘ్ని గురూజీ మాట్లా డుతూ ఆధ్యాత్మిక జ్ఞాన సంపద భారతదేశం సొంతమన్నారు. ఋషులు, మునులు, గురువులు మన కు అందించిన మహోన్నతమైన జ్ఞాన సంపదను సామాన్యునికి సైతం అర్ధమయ్యే రీతిలో బోధించే గురువులను స్మరించుకోవటం అదృష్టంగా భావించాలన్నారు. తొ లుత మంగళవా రం ఉదయాన్నే వ్యాసభగవానులకు సుప్రభాతసేవ, వ్యాసభగవానుడి ఉ త్సవమూర్తికి రథోత్సవం, ఆదిగురువు వ్యా స భగవానుడికి ప్రత్యేకపూజలు నిర్వహించారు.

నూతన బస్‌లను ప్రారంభించిన మంత్రులు

నూతన బస్‌లను ప్రారంభించిన మంత్రులు

నూతన బస్‌లను ప్రారంభించిన మంత్రులు