
ట్రాక్టర్ తిరగబడి వ్యక్తి మృతి
సంతమాగులూరు(అద్దంకి): ట్రాక్టర్ అదుపు తప్పి తిరగబడిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈఘటన సంతమాగులూరు మండలం వెల్లలచెరువు గ్రామ సమీపంలో సోమవారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. జే పంగులూరు మండలం రామకూరు గ్రామానికి చెందిన నల్లపాటి మల్లికార్జునరావు(41) తన ట్రాక్టరును నడుపుకుంటూ సంతమాగులూరు నుంచి వినుకొండ వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో వెల్లలచెరువు గ్రామ సమీపంలోని పెట్రోలు బంకు సమీపంలోకి రాగానే గోతుల రోడ్డు కావడంతో బ్రేక్ వేయగా అదుపు తప్పి తిరగబడింది. ఈ ఘటనలో మల్లికార్జునరావు పైనుంచి కిందపడగానే ట్రాక్టరు టైరు తలపైకి ఎక్కింది. రక్తగాయం ఆవడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇరువురు పిల్లలు ఉన్నారు. భర్త మృతితో భార్య, కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. మృతుడి మామ తేలప్రోలు ఆంజనేయులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పట్టాభిరామయ్య తెలిపారు.

ట్రాక్టర్ తిరగబడి వ్యక్తి మృతి