
ప్రజలను వంచించిన చంద్రబాబు
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, పర్చూరు ఇన్‌చార్జి గాదె మధుసూదనరెడ్డి
మార్టూరు(చినగంజాం): రాష్ట్ర ప్రజలను చంద్రబాబు తన మోసపూరిత మాటలతో వంచన చేస్తున్నారని.. ప్రజలంతా అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసన్న మైందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, పర్చూరు ఇన్‌చార్జ్ గాదె మదుసూదనరెడ్డి పిలుపునిచ్చారు. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ ( రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో) అనే కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన మార్టూరులోని ఇంటూరి ఫంక్షన్ హాలులో ఆదివారం నాయకులు, కార్యకర్తలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు జంపని వీరయ్య చౌదరి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో గాదె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తొలుత బాబు జగ్జీవనన్‌రాం, మహానేత వైఎస్సార్ చిత్రపటాలకు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ క్యూఆర్ కోడ్‌ను ఆయన ఆవిష్కరించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి బండారు ప్రభాకరరావు, రాష్ట్ర యూత్ వింగ్ సంయుక్త కార్యదర్శి ఉప్పలపాటి అనిల్, జిల్లా ఉపాధ్యక్షుడు పఠాన్ కాలేషావలి, మాజీ డెయిరీ చైర్మన్ ఉప్పలపాటి చెంగలయ్య, తాటి వెంకటరావు, ద్రోణాదుల మాజీ సర్పంచ్ పెంటేల సత్యనారాయణ, టౌన్ అధ్యక్షుడు అడక గంగయ్య, ఐటీ వింగ్ అధ్యక్షుడు జి. రవిచంద్, ఎస్టీ సెల్ చిన్ననాయక్, మండల వైస్ ప్రెసిడెంట్ ఖాదర్ బాష, బండి రామయ్య, మైలా నాగేశ్వరరావు, గడ్డం మస్తాన్‌వలి, బాబు నాయక్, మండల పార్టీ కన్వీనర్‌లు, మాజీ కన్వీనర్‌లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అనుబంధ విభాగం అధ్యక్షులు, వివిధ హోదాల్లోని ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియా వారియర్స్ తదితరులు భారీగా పాల్గొన్నారు.