
చినపులివర్రులో టీడీపీ నాయకుడి ఆగడాలు
కొల్లూరు: అధికార దాహంతో టీడీపీ నాయకుల ఆగడాలకు అంతులేకుండా పోయింది. చినపులివర్రుకు చెందిన ఓ టీడీపీ నాయకుడు గ్రామం ప్రారంభంలో ఉన్న డ్రెయిన్‌లో పూడిక తీసి ఆ మట్టిని తన పొలానికి వెళ్లే దారి కోసం కాలువకు అడ్డుగా మెరక పోసుకున్నాడు. టీడీపీ నాయకుని తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్షాకాలంలో పంటలు ముంపునకు గురికాకుండా వర్షపు నీరు పారుదలకు వినియోగపడాల్చిన డ్రెయిన్‌ను మెరుగు పరచడంలో నిర్లక్ష్యం వహించడంతోపాటు, డ్రెయినేజీ కట్టలను బలపర్చడానికి వినియోగించాల్చిన పూడికతీత మట్టిని సొంత అవసరాలకు పచ్చ నాయకులు తరలించుకోవడంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. మట్టిని తరలించుకుపోవడానికి తోడు భారీ యంత్రాన్ని మట్టి తవ్వకానికి వినియోగించడం కారణంగా ఆర్‌అండ్‌బీకి చెందిన బీటీ రోడ్డు ధ్వంసం కావడంతో స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డ్రెయిన్‌లో పూడికతీసిన మట్టి
పొలం దారికి తరలింపు
రహదారి ధ్వంసం
స్థానికుల ఆగ్రహం

చినపులివర్రులో టీడీపీ నాయకుడి ఆగడాలు