కబళిస్తున్న ప్లాస్టిక్‌ భూతం | - | Sakshi
Sakshi News home page

కబళిస్తున్న ప్లాస్టిక్‌ భూతం

Jul 21 2025 5:33 AM | Updated on Jul 21 2025 5:33 AM

కబళిస

కబళిస్తున్న ప్లాస్టిక్‌ భూతం

బాపట్ల
సోమవారం శ్రీ 21 శ్రీ జూలై శ్రీ 2025

లక్ష్మీనరసింహస్వామికి పూజలు

వినుకొండ:కొండమెట్ల వద్ద ఉన్న లక్ష్మీనరసింహస్వామికి 16 రోజుల పండుగ సందర్భంగా ఆదివారం వసంతోత్సవం నిర్వహించారు. భక్తులు పూజలు, అభిషేకాలు, పొంగళ్లు చేశారు.

అమ్మవారికి బోనాలు

గురజాల: కనకదుర్గ అమ్మవారికి మహిళలు ఆదివారం బోనాలు సమర్పించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని పూజలు చేశారు.

చౌడేశ్వరీ అమ్మవారికి బోనాలు

రెంటచింతల: ఆషాఢమాస చివరి ఆదివారం చౌడేశ్వరి అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించారు. ప్రధాన అర్చకులు మారుతీశర్మ నేతృత్వంలో అమ్మవారికి పూజలు చేశారు.

అద్దంకి: మానవ నాగరికత ఏం సాధించిందంటే పర్యావరణ విధ్వంసం అనేది అందరికీ కనిపిస్తూనే ఉంది. ప్రస్తుతం ఆందోళనకర రీతిలో పెరిగిపోతున్న ప్లాస్టిక్‌ భూతమే దీనికి నిదర్శనం. ముఖ్యంగా పాలిథిన్‌ కవర్ల రూపంలో మృత్యుమార్గం తయారవుతోంది. సుమారు పాతిక, ముప్పై ఏళ్ల కిందట ప్రతి ఒక్కరి చేతిలో గుడ్డ సంచులే కనిపించేవి. ఏ వస్తువు కావాలన్నా వాటిలోనే తెచ్చుకొనేవారు. కానీ ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగుల రాకతో గుడ్డ సంచుల వాడకం పూర్తిగా ఆగిపోయింది. రీసైకిల్‌ అయ్యే ప్లాస్టిక్‌ మినహా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌తో పర్యావరణానికి పెనుముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు మొత్తుకుంటున్నా, విక్రయదారులు, వ్యాపారులు, వినియోగదారులు పెడచెవిన పెడుతున్నారు. అయితే ప్లాస్టిక్‌ వాడకాన్ని గట్టిగా అమలు చేయాలనే ఉద్దేంతో బాపట్ల జిల్లాలో ఈనెల 19 నుంచి సింగలిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై నిషేధం విధిస్తూ కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. శనివారం జిల్లా వ్యాప్తంగా పట్టణాల్లో, మునిసిపాలిటీల్లో అవగాహన సమావేశాలు, ర్యాలీలు నిర్వహించారు. ప్లాస్టిక్‌ రసాయన సమ్మిళిత పదార్థం. ఇది చౌకగా లభించడంతో ప్రతి వస్తువును దానితోనే తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఏ వస్తువు కొనుగోలు చేసినా ప్లాసిక్ట్‌ క్యారీ బ్యాగ్‌లో పెట్టి ఇవ్వడం పరిపాటిగా మారింది. గ్లాసులు సైతం ప్లాస్టిక్‌తోనే తయారు చేస్తున్నారు.

అనర్థాలు ఎన్నో..

ప్లాస్టిక్‌ సంచులు, గ్లాసుల వాడిన తరువాత వాటిని ఎక్కడపడితే అక్కడ పడేస్తుండటంతో కాలువలు మూసుకుపోతున్నాయి. ఆహార పదార్థాలున్న క్యారీ బ్యాగుల్లోని పదార్థాల కోసం ఆవులు వాటిని తినడంతో మృత్యువాత పడుతున్నాయి. విచక్షణా రహితంగా ఊపయోగించే ప్లాస్టిక్‌లోని రసాయనాల వల్ల పర్యావరణం కలుషితం అవుతోంది. ప్లాస్టిక్‌ సైజర్లు అనేవి తక్కువ భాష్పశీల స్వభావం కలిగిన సేంద్రీయ ఈస్టర్లు. వాటితో తయారైన ప్లాస్టిక్‌.. ఆహార పదార్థాల్లో కలిసే విధంగా ఉంటాయి. ప్లాస్టిక్‌ సైజర్లు కేన్సర్‌ కారకాలు కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ప్లాస్టిక్‌ తయారీలో కాడ్మియం, సీసం వంటి విషపూరిత ధాతువులు ఉపయోగించినప్పుడు ఆ అణువులు ఆఽహార పదార్థాలను కలుషితం చేస్తాయి. కాడ్మియం చిన్నమోతాదులో వాడినా వాంతులు, గుండె పెద్దది కావడమనే సమస్య తెచ్చిపెడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కవ కాలం సీసం ధాతువు శరీరంలో చేరితే మెదడు కణాలు క్షీణించిపోతాయి. సింగిల్‌ యూజ్‌ (ఒకసారి వాడిపడేసే) ప్లాస్టిక్‌ సంచులను బయటేడం వలన డ్రైనేజీలోకి వెళ్లి మూసుకుపోయేలా చేసి అశుభ్రమైన వాతావరణాన్ని కలిగిస్తుంది. నీటి ద్వారా వచ్చే వ్యాధులకు ప్లాస్టిక్‌ కారణం అవుతోంది. భూమిలో చేరిన సమయంలో భూగర్భ జలాలు ఇంక కుండా చేసే ప్రమాదం ఉంది. వాటిని తగులబెట్టే సమయంలో వచ్చే విషపూరిత వాయువుల వల్ల పర్యావరణం కలుషితం అవుతుంది. ప్లాస్టిక్‌కు బదులు, జనపనారతో చేసిన సంచులు, గుడ్డ సంచులు, అరటితో చేసిన ప్లేట్లు, కాగితంతో తయారు చేసిన గ్లాసులు, పేట్లు వాడకంతో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించి పర్యావరణ హితం చేయవచ్చు.

7

న్యూస్‌రీల్‌

అక్టోబరు నుంచి కేసులు

కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లాలో, అద్దంకి పట్టణంలో ఈనెల 19నుంచి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగంపై నిషేధం అమల్లో ఉంటుంది. దీన్ని ఎవరూ తేలికగా తీసుకోకూడదు. మొదటి మూడు నెలల వరకు తనిఖీలు చేసి.. అవగాహన కల్పిస్తాం. అక్టోబరు నుంచి విక్రయించినా, కొనుగోలు చేసినా క్రిమినల్‌ కేసులు పెట్టే అవకాశం ఉంది. ప్రజలంతా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ సంచులు నిషేధించి నార సంచులు, గుడ్డ సంచులు వాడాలి.

రవీంద్ర, మున్సిపల్‌ కమిషనర్‌

సింగిల్‌ యూజ్‌తో

పర్యావరణానికి పెనుముప్పు

క్యాన్సర్‌ వచ్చే అవకాశం

అవగాహన లేక పెరిగిపోతున్న వాడకం

జిల్లాలో ప్రతి రోజూ 200 నుంచి 500

కిలోల ప్లాస్టిక్‌ వాడకం

జిల్లాలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌

వాడకంపై నిషేధం

కబళిస్తున్న ప్లాస్టిక్‌ భూతం 1
1/6

కబళిస్తున్న ప్లాస్టిక్‌ భూతం

కబళిస్తున్న ప్లాస్టిక్‌ భూతం 2
2/6

కబళిస్తున్న ప్లాస్టిక్‌ భూతం

కబళిస్తున్న ప్లాస్టిక్‌ భూతం 3
3/6

కబళిస్తున్న ప్లాస్టిక్‌ భూతం

కబళిస్తున్న ప్లాస్టిక్‌ భూతం 4
4/6

కబళిస్తున్న ప్లాస్టిక్‌ భూతం

కబళిస్తున్న ప్లాస్టిక్‌ భూతం 5
5/6

కబళిస్తున్న ప్లాస్టిక్‌ భూతం

కబళిస్తున్న ప్లాస్టిక్‌ భూతం 6
6/6

కబళిస్తున్న ప్లాస్టిక్‌ భూతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement