
కల్తీ మద్యం తయారీ ముఠా అరెస్ట్
రేపల్లె: కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ జిల్లా అధికారి బి.వెంకటేశ్వర్లు తెలిపారు. పట్టణంలోని ఎకై ్సజ్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. రేపల్లె మండలం మోళ్లగుంట గ్రామంలో కల్తీ మద్యం తయారు చేస్తున్నారన్న సమాచారంతో ఎకై ్సజ్ అధికారులు దాడులు చేశారు. గ్రామంలోని మోపిదేవి సతీష్ గృహాన్ని పరిశీలించారు. గృహంలో కల్తీ మద్యం తయారు చేసే ముడి సరుకుతోపాటు మద్యం నిల్వ ఉంచే టిన్‌లు, క్వార్టర్ సీసాలు కనిపించాయి. మోళ్లగుంటకు చెందిన మోపిదేవి సతీష్, కన్నా రాములతోపాటు కృష్ణాజిల్లా గుల్లలమోద గ్రామానికి చెందిన విశ్వనాథపల్లి సూర్యలను అదుపులోకి తీసుకున్నారు. మోపిదేవి సతీష్, సూర్య, రాములతోపాటు మరో ముగ్గురు కలిసి గత కొన్ని సంవత్సరాలుగా అక్రమ కల్తీ మద్యం తయారు చేస్తున్నట్లు విచారణలో గుర్తించారు. ఇథనాల్ ఆల్కహాల్ 10 లీటర్లు, 21 ఖాళీ క్యాన్‌లు, 510 ఖాళీ సీసాలు స్వాధీనం చేసుకున్నారు. కేసులో ప్రధాన సూత్రధారి అయిన యానం శ్రీను అలియాస్ నులికుర్తి శ్రీనివాస్ హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి ఇథనాల్ ఆల్కహాల్‌ను సతీష్‌కు పంపుతాడు. ఆల్కహాల్‌లో రంగు నీరు కలిసి సతీష్, సూర్య, రాములు 180 మిల్లీలీటర్ల సీసాలలో నింపి చుట్టు ప్రక్కల ప్రాంతాలలో విక్రయిస్తూ అక్రమంగా నగదు సంపాదిస్తున్నాడు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులైన యానం శ్రీను, రూతుల శ్రీనివాస్ (హైదరాబాద్), చరణ్‌జిత్ (హైదరాబాద్)లను త్వరలో అరెస్ట్ చేస్తామని ఎకై ్సజ్ అధికారి తెలిపారు. వీరిరువురికి హైదరాబాద్‌లో ఉన్న నకిలీ మద్యం తయారీ ముఠాతో సంబంధాలు ఉన్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. సమావేశంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ సూపరింటెండెంట్ జనార్థన్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ మధుబాబు, ఎకై ్సజ్ సీఐ దివాకర్, ఎస్‌ఐలు రాజ్యలక్ష్మి, రామారావు పాల్గొన్నారు.