
కిరాణా షాపులో మద్యం బెల్టు షాపు
బలిజేపల్లి(వేమూరు): కిరాణా షాపులో మద్యం బెల్టు షాపు నిర్వహిస్తున్న నిర్వాహకులపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వేమూరు మండలం బలిజేపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు బంధువులు మద్యం బెల్టు షాపు నిర్వహిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఎకై ్సజ్ అధికారులు బెల్టు షాపు నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు తెలిపారు. బలిజేపల్లి గ్రామంలో మద్యం బెల్టు షాపులతోపాటు గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని గ్రామస్తులు వ్యక్తం చేశారు. అధికారులు గ్రామంలో మద్యం బెల్టు షాపు, గంజాయి అమ్మకాలు నిర్మూలన చేయాలని కోరారు.