
సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం
రేపల్లె: మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీపీఎం ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ కార్మికులు గురువారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మణిలాల్ మాట్లాడుతూ కార్మికుల వేతనాలు పెంచాలని, సమస్యలను పరిష్కరించాలని గత 15 రోజుల నుంచి శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటం బాధాకరమన్నారు. 4వ తేదీ నుంచి సమ్మెలో భాగంగా అత్యవసర సేవలైన నీటి, విద్యుత్ సరఫరా విధులలో కార్మికులు సైతం తమ సేవలను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ రేపల్లె అధ్యక్షుడు ప్రభాకరరావు, కార్యదర్శి రవిబాబు, కోశాధికారి రాఘవేంద్రరావు, సభ్యులు యువరాజు, రవి, ప్రభాకర్, అనూష, గీత తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం పట్టణ కార్యదర్శి మణిలాల్