
లింగ నిర్ధారణ సెంటర్లపై ప్రత్యేక నిఘా
చీరాల టౌన్: ఆడ, మగ తేడాల లేకుండా సమానంగా చూసుకుకోవాలని.. లింగనిర్ధారణ చేయకుండా స్కాన్ సెంటర్లపై నిఘా ఉంచాలని చీరాల ఆర్డీఓ తూమాటి చంద్రశేఖర్‌నాయుడు సూచించారు. సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సబ్ డిస్ట్రిక్ట్ పూర్వ గర్భ, ప్రసవ పూర్వ నియంత్రణ చట్టంపై సబ్ డిస్ట్రిక్ట్ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఆర్డీవోతోపాటుగా పోలీసు, రెవెన్యూ, వైద్యులు, ఎన్జీవోలు, ఇతర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆర్డీవో మాట్లాడుతూ లింగ నిర్ధారణ చేయడం, వెల్లడించడం చట్టరీత్యా నేరమన్నారు. సామాజిక సమతుల్యత, బాలికల జనన నిష్పత్తిని మెరుగుపరచాలన్నారు. లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆడపిల్లల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని, ఆడ, మగ లింగ భేదం లేకుండా ఇద్దరిని సమానంగా చూడాలన్నారు. సమాజంలో జరుగతున్న ప్రతి అంశాలను పిల్లలకు తెలియజేసి చైతన్య వంతులుగా చేయాలన్నారు. అబార్షన్లు లేకుండా చూడటం, ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్, స్కాన్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయకుండా కమిటీ సభ్యులు చూడాలన్నారు. అలానే భ్రూణ హత్యలు జరగకుండా, బాల్య వివాహాలు జరగకుండా చూడాలన్నారు. చట్టాల ఉల్లంఘనలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆర్డీవో కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా అడ్వయిజరీ కమిటీ చైర్మన్ డాక్టర్ రత్నమన్మోహన్, గైనకాలసిజ్ట్ డాక్టర్ షణ్ముఖశ్రీ, డాక్టర్ యాకోబు, డాక్టర్ బ్రహ్మం, ఎన్జీవోలు, వైద్యులు డాక్టర్ సుభాషిణి, డాక్టర్ విజయ్‌కుమార్, రాజా సాల్మన్, మరియమ్మ, అరుణ తదితరులు పాల్గొన్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు