
ఉద్యోగ భద్రత కల్పించకపోతే పోరాటాలు
బాపట్ల టౌన్: ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం. రమేష్‌బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలోని శ్రీనివాసనగర్‌లో ఆదివారంలో ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్‌బాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులు 12 నెలలుగా వేతనాలు అందక అవస్థలు పడుతున్నారని తెలిపారు. తక్షణమే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెంనాయుడు చొరవ తీసుకొని వేతనాలు వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు. భవిష్యత్తులో వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేంత వరకు ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని తెలిపారు. అనంతరం ఏపీ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా సలహాదారులుగా శ్యామ్యూల్, శ్రీనివాసరెడ్డి, గౌరవాధ్యక్షులుగా రహేల్ రావ్, అధ్యక్షులుగా సిమన్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా సుధారాణి, డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా ఏడుకొండలు, కోశాధికారిగా భారతి, ఆఫీస్ బేరర్స్‌గా సంధ్యారాణి, వెంకటరెడ్డి, నాగేశ్వరమ్మ, విజయ్ కుమార్, శిరీష, సౌజన్యతో పాటు 15మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సింగర్ కొండా, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శ్యామ్యూల్, రాష్ట్ర నాయకులు సునీల్, నాగేశ్వరెడ్డి పాల్గొన్నారు.
ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌బాబు