
చెట్టును ఢీకొట్టిన మినీ లారీ
బల్లికురవ: మామిడి పండ్లతో తెలంగాణకి వెళుతున్న మినీ లారీ ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవటంతో చెట్టును ఢీకొట్టి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన శనివారం ఉదయం మేదరమెట్ల– నార్కెట్‌పల్లి నామ్ రహదారిలోని మండలంలోని ఎస్‌ఎల్ గుడిపాడు గ్రామ సమీపంలో జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన మినీ లారీ మామిడి పండ్లతో వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. డ్రైవర్ జి.అంజిబాబు, క్లీనర్ ఎం. నవీన్ గాయాలపాలయ్యారు. స్థానికులు హైవే అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. పారా మెడికల్ రాజు, విద్యాసాగర్ క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స చేశారు. మెరుగైన చికిత్సకు సంతమాగులూరు పీహెచ్‌సీకి తరలించారు. లారీ అదుపుతప్పటంతో మామిడి పండ్లు రోడ్డుపాలయ్యాయి.
డ్రైవర్, క్లీనర్‌లకు గాయాలు