
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
వేటపాలెం: బైపాస్ రోడ్డు దాటుతున్న వ్యక్తిని వేగంగా వచ్చి ఆటో ఢీ కొట్టిన సంఘటనలో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. 216 జాతీయ రహదారి బైపాస్ రోడ్డులో సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాల దగ్గరలో సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు.. చీరాల వైపు నుంచి మామిడి కాయల లోడుతో ఆటో ఒంగోలు వైపు వేగంగా వెళుతోంది. సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాల వద్ద రోడ్డు దాటుతున్న కొమరగిరి బాబూరావుని ఆటో ఢీ కొట్టింది. బాబూరావు ఎగిరి పక్కన పడ్డాడు. అతనికి కాలుకి తీవ్రగాయాలయ్యాయి. 108కి సమాచారం ఇవ్వగా క్షతగాత్రుని చీరాల ఏరియా వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. ఆటో ఆపకుండా వేగంగా వెళ్లిపోయాడు.