
గుంటూరు కాపు హాస్టల్‌లో ప్రవేశాలకు ప్రకటన
గుంటూరు రూరల్: నగర శివారు గోరంట్ల గ్రామం హోసన్నా మందిరం వెనుక ఉన్న కాపు విద్యార్థి వసతి గృహంలో అడ్మిషన్‌ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలగ అభ్యుదయ సంఘం కార్యదర్శి బాలిశెట్టి విజయ్‌కుమార్ మంగళవారం తెలిపారు. వసతి గృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ, దూరప్రాంతాలకు చెందిన కాపు విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్ నుంచి పీహెచ్‌డీ వరకూ చదువుతున్న విద్యార్థులు, ప్రొఫెషనల్ కోర్సులు చదివేవారు, ఎంబీఏ, ఎంసీఏ, సీఏ, సీపీటీ, సివిల్ సర్వీసులు, గ్రూప్స్, ఎస్‌ఎస్‌సీ, బ్యాంక్ పీవో వంటి పోటీ పరీక్షలు రాసేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు ఫోను నంబర్లు 85208 71568, 86865 55999 లలో సంప్రదించాలన్నారు. సమావేశంలో పూరిబండి శ్రీకాంత్, డేగల వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.