యువతకు స్ఫూర్తి రాజేంద్రప్రసాద్‌ జీవితం | - | Sakshi
Sakshi News home page

యువతకు స్ఫూర్తి రాజేంద్రప్రసాద్‌ జీవితం

Jun 22 2025 3:38 AM | Updated on Jun 22 2025 3:38 AM

యువతకు స్ఫూర్తి రాజేంద్రప్రసాద్‌ జీవితం

యువతకు స్ఫూర్తి రాజేంద్రప్రసాద్‌ జీవితం

తెనాలి: సైన్యంలో దేశ రక్షణ విధుల్లో కొనసాగి, బయటకొచ్చాక వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి క్రీడారంగ అభివృద్ధికి తోడ్పడుతూ సమాజసేవలో కొనసాగుతున్న చలసాని బాబూ రాజేంద్రప్రసాద్‌ జీవితం నేటియువతకు స్ఫూర్తిదాయకమని ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్‌ కమిషనర్‌ బి.కె.రావు అన్నారు. రాజేంద్రప్రసాద్‌ నిర్వహిస్తున్న సీబీఆర్‌ అకాడమీ రజతోత్సవాల సందర్భంగా తపాలా శాఖ తీసుకొచ్చిన ప్రత్యేక కవరును శనివారం సాయంత్రం తెనాలిలోని ప్రధాన కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. సభకు మా–ఏపీ వ్యవస్థాపకుడు దిలీప్‌రాజా అధ్యక్షత వహించారు. రాజేంద్రప్రసాద్‌ నినాదం ‘విన్‌ ఫర్‌ ఇండియా...డై ఫర్‌ కంట్రీ’ తనను ఎంతగానో ఆకర్షించిందని బీకే రావు చెప్పారు. రాజేంద్రప్రసాద్‌ సేవల్ని గుర్తించి తపాలశాఖ ప్రత్యేక కవరును విడుదల చేయడంఅభినందనీయమని తెలిపారు. తెనాలి డివిజన్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ ఎం.శ్రీనివాసు మాట్లాడుతూ దేశభక్తుడి గురించి ప్రత్యేక కవరును విడుదల చేయటం సంతోషంగా ఉందన్నారు. సైనిక్‌ వెల్ఫేర్‌ బోర్డు బ్రిగేడియర్‌ వెంకటరెడ్డి మాట్లాడుతూ సంపాదించిన డబ్బును సమాజసేవకు వినియోగిస్తున్న మాజీ సైనికుడు సీబీఆర్‌ ప్రసాద్‌ను భారత ప్రభుత్వం గుర్తించాలని అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement