ఆరోగ్య సంరక్షణలో అంగన్‌వాడీల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్య సంరక్షణలో అంగన్‌వాడీల పాత్ర కీలకం

Jun 20 2025 6:07 AM | Updated on Jun 20 2025 6:07 AM

ఆరోగ్య సంరక్షణలో అంగన్‌వాడీల పాత్ర కీలకం

ఆరోగ్య సంరక్షణలో అంగన్‌వాడీల పాత్ర కీలకం

సీడీపీవో సుచిత్ర

రేపల్లె: గర్భిణులు, బాలింతలు, చిన్నారుల నిరంతర ఆరోగ్య సంరక్షణ బాధ్యతలలో అంగన్‌వాడీ కార్యకర్తల పాత్రే కీలకమని సీడీపీవో ఎం.సుచిత్ర పేర్కొన్నారు. సెక్టార్‌ పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలతో పట్టణంలోని ఐసీడీఎస్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అంగన్‌వాడీలు, ఆయాలు యూనిఫామ్‌ తప్పనిసరిగా ధరించాలని, సమయ పాలన పాటించాలని సూచించారు. పౌష్టిక విలువలతో కూడిన ఆహారం అందించటంతోపాటు చిన్నారులకు ఆట పాటలతో కూడిన విద్య అందించాలన్నారు. పనివేళల్లో ప్రతి రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కేంద్రాలలో అందుబాటులో ఉండాలన్నారు. ప్రతి కేంద్రంలో మదర్స్‌ వాట్సాప్‌ గ్రూపును ఏర్పాటు చేసి పిల్లలు చేసే కార్యక్రమాలను గ్రూపు ద్వారా తల్లులకు తెలియజేయాలన్నారు. కేంద్రాలకు గుడ్లు, బాలామృతం, బాల సంజీవని, పాలు వంటి పదార్థాలు సకాలంలో రాకుంటే తమ దృష్టికి తీసుకువచ్చి సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. కేంద్రాలలో నిర్వర్తించాల్సిన విధులు, బాధ్యతలను వివరించారు. కార్యక్రమంలో ప్రధమ్‌ కోఆర్డినేటర్‌ త్రివేణి, సూపర్‌వైజర్‌లు సీహెచ్‌ హిమబిందు, టీ.రాధిక, ఎస్‌.సుజాత, విజయలక్ష్మి, మంజుల, నాగలక్ష్మి, అరుణ, అంగన్‌వాడీలు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement