పత్రికా కార్యాలయాలపై దాడి హేయమైన చర్య
బాపట్లటౌన్: పత్రికల్లో వార్తలు ప్రచురించారనే అక్కసుతో పత్రికా కార్యాలయాలపై దాడులు చేయటం హేయమైన చర్యని బాపట్ల జర్నలిస్ట్ అసోసియేషన్ గౌరవ సలహాదారుడు ఉప్పాల శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం సాక్షి కార్యాలయాలపై జరిగిన దాడికి నిరసనగా బాపట్ల జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణ సీఐకు వినతిపత్రం అందజేశారు. ఉప్పాల శ్రీనివాసరావు మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా పత్రికా కార్యాలయాల గేట్లు ధ్వంసం చేయటం, కార్యాలయాలపై రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేయటం, సాక్షి నేమ్ బోర్డులు ధ్వంసం చేసి తగలపెట్టడం సమంజసం కాదన్నారు. దీనికి కారణమైన వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు బిజివేముల రమణారెడ్డి, జి.రాఘవేంద్రరావు, మురికిపూడి అంజయ్య, అంగిరేకుల కోటేశ్వరరావు, శీలం సాగర్, తోటకృష్ణమూర్తి, షేక్ మస్తాన్‌వలి, చిన్నం లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
బాపట్ల జర్నలిస్ట్ వెల్ఫేర్ సంఘం సభ్యులు
పట్టణ సీఐకు వినతిపత్రం అందజేత


