బాపట్లటౌన్: మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళి తెలిపారు. రంజాన్ పండగను పురస్కరించుకొని గురువారం, సాయంత్రం పట్టణంలోని కాపు కల్యాణ మండపంలో జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి పాల్గొని మాట్లాడారు. తొలుత ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం మతంలో ప్రపంచంలో అందరూ ఒప్పుకునేది సహృద భావమన్నారు. అందులో ఎలాంటి వర్గాలు, కులాలు, భేదాలు, తారతమ్యాలు, వ్యత్యాసాలు లేకుండా అందరూ ఒకచోట గుమికూడి ప్రార్థన చేసుకునే సోదర భావంతో ఉంటుందన్నారు. ముస్లింలు హిందువులతో కలిసిపోయి అన్నదమ్ములుగా జీవిస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న మతాలు ఉన్నా కలిసిమెలిసి జీవిస్తున్నారని అన్నారు. అన్ని మతాలవారు ఎప్పుడు కలిసి మలిచి సోదరుభావంతో మెలగాలన్నారు. ముస్లింలకు అతి పవిత్రమైన మాసం రంజాన్ మాసం అన్నారు. నెలవంక చూసినప్పటి నుండి ప్రారంభం అయ్యే ఈ మాసంలో ముస్లిం సోదరులు కఠోరమైన ఉపవాస దీక్ష చేపడతారన్నారు. అనంతరం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు వడ్డించారు. కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి షేక్ రోషన్ జమీర్ బాషా, బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి గ్లోరియా, బాపట్ల తహసీల్దార్ సలీమా పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి