
పెదకాకాని పీఎస్ సీఐ, సిబ్బంది, పీపీని అభినందిస్తున్న ఎస్పీ ఆరిఫ్‌హఫీజ్
నగరంపాలెం: బీడీఎస్ విద్యార్థిని హత్య కేసులో నిందితుడికి శిక్ష పడేలా దర్యాప్తు చేపట్టిన పెదకాకాని పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను జిల్లా ఎస్పీ ఆరిఫ్‌హఫీజ్ అభినందించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన తపస్వి (21) బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (బీడీఎస్) తృతీయ సంవత్సరం చదివేది. అదేజిల్లా ఉంగుటూరు మండలం మానికొండకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జ్ఞానేశ్వర్ ఆమెను ప్రేమించమని వేధించేవాడు. ఈ క్రమంలో గుంటూరు తక్కెళ్లపాడులోని సహచర డెంటల్ విద్యార్థిని రూంలో ఆమె ఉంటుంది. దీంతో ఆమెను అతను గతేడాది డిసెంబర్ ఐదో తేదీ రాత్రి సర్జికల్ బ్లేడ్‌తో గొంతు కోశాడు. ఆమెను ఆస్పత్రికి తరలించగా మృతిచెందింది. అప్పట్లో ఈ హత్య సంచలనం రేకెత్తించింది. దీనిపై పెదకాకాని పీఎస్ సీఐ సురేష్‌బాబు, సిబ్బంది దర్యాప్తు చేపట్టారు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ జడ్జి(పీడీజే) కోర్టు న్యాయమూర్తి సోమవారం ముద్దాయికి జీవిత కాలం కఠిన కారాగార శిక్ష, రూ.6 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ క్రమంలో పెదకాకాని పీఎస్ సీఐ సురేష్‌బాబు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎండీ సుల్తాన్ సిరాజుద్దీన్, పోలీస్ సిబ్బందిని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ అభినందించారు.
జిల్లా జూడో సబ్‌జూనియర్ జట్టు ఎంపిక
నరసరావుపేట ఈస్ట్: సత్తెనపల్లిరోడ్డులోని డీఎస్‌ఏ స్టేడియంలో పల్నాడు జిల్లా సబ్ జూనియర్ జూడో జట్టును ఎంపిక చేసినట్టు జూడో అసోసియేషన్ కార్యదర్శి జి.సాయిరామ్ సోమవారం తెలిపారు. బాలుర జట్టులో వివిధ విభాగాలలో పి.రమేష్, కె.శ్రీనివాసరావు, జి.కుశాల్, టి.సాకేత్, జి.అభిషేక్‌లారెన్స్, ఆర్.సురేంద్ర, టి.ఫణి, కె.మహేష్, జి.దిలీప్ ఎంపికయ్యారు. బాలికల విభాగాలలో బి.ప్రియ, ఎస్.అమ్ములు, బి.వర్షిని, జి.సుష్మ, కె.సుబ్బలక్ష్మి, టి.హారిక, ఎన్.మధుమతి ఎంపికయ్యారు. ఎంపిక కమిటీ సభ్యులుగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు పి.సునీత, ఉపాధ్యక్షుడు ఓ.శివకృష్ణ, పరిశీలకునిగా అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పి.రాంబాబు వ్యవహరించారు. ఎంపికై న జట్టు క్రీడాకారులు ఈనెల తొమ్మిది నుంచి 11వ తేదీ వరకు తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్ జూడో ఛాంపియన్‌షిప్ పోటీలలో పల్నాడుజిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment