
గ్రహఫలం...శుక్రవారం, 29.09.23
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం,
సూర్యోదయం: 5.53, సూర్యాస్తమయం: 5.51.
తిథి: పౌర్ణమి సా.4.10 వరకు, తదుపరి బ.పాడ్యమి,
నక్షత్రం: ఉత్తరాభాద్ర రా.1.21 వరకు, తదుపరి రేవతి,
వర్జ్యం: ఉ.11.50 నుండి 1.20 వరకు,
దుర్ముహూర్తం: ఉ.8.15 నుండి 9.04 వరకు, తదుపరి ప.12.14 నుండి 1.04 వరకు,
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు,
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు,
అమృతఘడియలు: రా.8.48 నుండి 10.20 వరకు;
మేషం: కొత్త పనులు చేపడతారు. దూరపు బంధువుల కలయిక. ప్రముఖులతో పరిచయాలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
వృషభం: కొత్త పరిచయాలు. పాతబాకీలు వసూలవుతాయి. సంఘంలో గౌరవం. కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.
మిథునం: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యయప్రయాసలు.
కర్కాటకం: దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. పనుల్లో జాప్యం. ప్రయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
సింహం: కొత్త పనులు చేపడతారు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. ఆప్తుల నుంచి ధనలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.
కన్య: ప్రయత్నాలు సఫలం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు క్లిష్ట సమస్యలు తీరతాయి. సమాజసేవలో పాల్గొంటారు. వాహనయోగం.
తుల: ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. నూతన ఒప్పందాలు.
వృశ్చికం: ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. వ్యవహారాలలో ఒత్తిడులు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. దైవదర్శనాలు. స్థిరాస్తి వివాదాలు.
ధనుస్సు: సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
మకరం: వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయణాలు. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు.ఉద్యోగాలలో మార్పులు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ధనవ్యయం.
కుంభం: నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు. పనులలో పురోగతి. ఇంటాబయటా అనుకూలం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.
మీనం: ఆకస్మిక ప్రయాణాలు. రుణఒత్తిడులు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.