
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి శు.చతుర్దశి ప.11.55 వరకు తదుపరి పౌర్ణమి, నక్షత్రం స్వాతి ప.3.10 వరకు తదుపరి విశాఖ, వర్జ్యం రా.8.31 నుండి 10.04 వరకు, దుర్ముహూర్తం సా.4.35 నుండి 5.26 వరకు, అమృతఘడియలు... ఉ.6.39 నుండి 8.12 వరకు.
సూర్యోదయం : 5.32
సూర్యాస్తమయం : 6.19
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
మేషం..మిత్రుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. చేపట్టిన పనుల్లో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.
వృషభం...కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
మిథునం....పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.
కర్కాటకం...మిత్రులు, బంధువులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో ప్రతిబంధకాలు. వ్యాపారాలలో కొంత నిరాశ. ఉద్యోగాలలో పనిభారం.
సింహం....శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. వాహనాలు ఆభరణాలు కొంటారు. వ్యాపారాలలో పురోభివృద్ధి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
కన్య....అనుకున్న పనుల్లో స్వల్ప ఆటంకాలు. వ్యయప్రయాసలు. బంధువుల నుంచి ఒత్తిడులు. నిరుద్యోగులకు నిరుత్సాహం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందర గోళం.
తుల.....సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
వృశ్చికం...ప్రయాణాలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆలోచనలు కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
ధనుస్సు..వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సందేశం. నూతన విద్యావకాశాలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొంత ఊరట.
మకరం....చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.
కుంభం....వ్యయప్రయాసలు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.
మీనం...అనుకోని ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు.