ఈ రాశి వారికి అదనపు ఆదాయం అందుతుంది

Today Horoscope 03-07-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం, తిథి శు.చవితి ప.1.40 వరకు తదుపరి పంచమి, నక్షత్రం మఖ పూర్తి (24గంటలు), వర్జ్యం సా.5.10 నుండి 6.53 వరకు, దుర్ముహూర్తం సా.4.49 నుండి 5.41 వరకు, అమృతఘడియలు... రా.3.30 నుండి 5.14 వరకు. 

సూర్యోదయం        :  5.33
సూర్యాస్తమయం    :  6.35
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు
 

మేషం: ముఖ్య కార్యక్రమాలు కొంత నెమ్మదిగా కొనసాగుతాయి. స్నేహితులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. దేవాలయ దర్శనాలు. వ్యాపారులు ఒత్తిడులు ఎదుర్కొంటారు. ఉద్యోగులు మరింత శ్రమించాలి.

వృషభం: కొన్ని కార్యక్రమాలను వాయిదా వేసుకుంటారు. స్వల్ప అనారోగ్యం. కుటుంబసభ్యులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారులు కొంత నిదానం పాటించాలి. ఉద్యోగులకు పనిభారం.

మిథునం: సంఘంలో పరపతి పెరుగుతుంది. సోదరులతో ఆనందంగా గడుపుతారు. వాహన, గృహయోగాలు. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగులకు ఉత్సాహవంతమైన కాలం.

కర్కాటకం: ప్రయాణాలు చివరి క్షణంలో వాయిదా. కృషికి తగ్గ ఫలితం అంతంత మాత్రమే. పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. దేవాలయ దర్శనాలు. వ్యాపారులకు స్వల్పలాభాలు. ఉద్యోగులు, కళాకారులకు స్వల్ప ఒత్తిడులు.

సింహం: పరిశోధనలు ఫలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ఎదురుండదు.  కొత్త వ్యక్తుల పరిచయం. కళాకారులకు సన్మానాలు.

కన్య: కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ప్రయాణాలు వాయిదా. పాతస్నేహితులను కలుసుకుంటారు. ఖర్చులు. అధికం. వ్యాపారులకు ఒత్తిడులు. ఉద్యోగులకు విశ్రాంతి లోపం.

తుల: కొత్త కార్యాలు విజయవంతంగా పూర్తి. ఆదాయం పెరుగుతుంది. స్నేహితులతో వివాదాలు తీరతాయి. వాహన సౌఖ్యం. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు గుర్తింపు. కళాకారులకు ఉత్సాహం.

వృశ్చికం: కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. స్నేహితులను కలుసుకుంటారు. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు. దేవాలయ దర్శనాలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగాలలో పురోభివృద్ధి.

ధనుస్సు: కార్యక్రమాలలో జాప్యం. దూరప్రయాణాలు. దేవాలయ దర్శనాలు. ప్రముఖులతో సంభాషణలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు కొంత అనుకూలం.

మకరం: ఆదాయానికి మించి ఖర్చులు. తీర్థయాత్రలు. సోదరులతో కలహాలు. బాధ్యతలు అధికమవుతాయి. ఆరోగ్యసమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

కుంభం: సోదరులు, స్నేహితుల నుంచి శుభవర్తమానాలు. దేవాలయ దర్శనాలు. విందులువినోదాలు. కొత్త నిర్ణయాలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఉత్సాహవంతమైన సమయం.

మీనం: ఇంటిలో శుభకార్యాలు. అదనపు ఆదాయం. ముఖ్య నిర్ణయాలు. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. వ్యాపారులు పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top