గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: శు.సప్తమి తె.4.10 వరకు (తెల్లవారితే బుధవారం),తదుపరి అష్టమి, నక్షత్రం: పూర్వాషాఢ ప.12.14 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం: రా.8.40 నుండి 10.21 వరకు,దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.03 వరకు, తదుపరి రా.10.34 నుండి 11.23 వరకు, అమృత ఘడియలు: ఉ.7.03 నుండి 8.46 వరకు.
సూర్యోదయం : 6.00
సూర్యాస్తమయం : 5.28
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
మేషం... కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. కృషి ఫలించదు. కార్యక్రమాలలో జాప్యం. రావలసిన బాకీలు అందవు. ఆస్తి విషయాల్లో వివాదాలు. వ్యాపారాలలో చిక్కులు. ఉద్యోగాలలో గందరగోళం.
వృషభం.... కుటుంబసభ్యులతో వైరం. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఆందోళన. దైవదర్శనాలు. ఆరోగ్య సమస్యలు. ధనవ్యయం.
మిథునం.... ఆస్తి ఒప్పందాలు. వస్తులాభాలు. ఆదాయం పెరుగుతుంది. ధార్మిక చింతన. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. గృహ, వాహనయోగాలు. ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది.
కర్కాటకం.... విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. భూ, వాహనయోగాలు. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలబ్ధి.
సింహం.... బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. భూవివాదాలు. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగాలలో పనిభారం. దైవదర్శనాలు.
కన్య.... ఆదాయం తగ్గి నిరాశ కలిగిస్తుంది. బంధువులతో అకారణ వైరం. దూరప్రయాణాలు. శారీరక రుగ్మతలు. వ్యాపారాలలో కొంత నిరాశ చెందుతారు. ఉద్యోగాలలో పనిభారం.
తుల... నూతన పరిచయాలు. అదనపు రాబడి ఉంటుంది. ఇంటర్వ్యూలు సంతోషం కలిగిస్తాయి. ఆకస్మిక వస్తులాభాలు. వ్యాపారాలలో ప్రోత్సాహం. ఉద్యోగాలలో ఉత్సాహం.
వృశ్చికం....... కొత్త రుణాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా. శ్రమ పెరుగుతుంది. సన్నిహితులే సమస్యలు సృష్టి్టస్తారు. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. వ్యాపారాలు,ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
ధనుస్సు.... రాబడి పెరిగి అవసరాలు తీరతాయి. నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
మకరం..... వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో విభేదాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. ఆకస్మిక ప్రయాణాలు.
కుంభం.. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం. బంధువుల ద్వారా శుభవార్తలు. మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు ఉద్యోగాలలో పురోభివృద్ధి.
మీనం.... పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. కొన్ని బాకీలు అందుతాయి. శత్రువులు మిత్రులుగా మారతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో తగిన గుర్తింపు. దేవాలయ దర్శనాలు.


