
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: బ.షష్ఠి ప.11.19 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: కృత్తిక ప.2.54 వరకు, తదుపరి రోహిణి, వర్జ్యం: తె.5.49 నుండి 7.19 వరకు (తెల్లవారితే ఆదివారం), దుర్ముహూర్తం: ఉ.5.44 నుండి 7.29 వరకు, అమృత ఘడియలు: ప.12.17 నుండి 2.06 వరకు.
సూర్యోదయం : 5.51
సూర్యాస్తమయం : 6.03
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : ప.1.30 నుండి 3.00 వరకు
మేషం: మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగమార్పులు.
వృషభం: కుటుంబసభ్యులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. మిత్రుల కలయిక. వృత్తి,వ్యాపారాలలో పైచేయి సాధిస్తారు.
మిథునం: ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. పనులు ముందుకు సాగవు. వృత్తి, వ్యాపారాలలో ఆటుపోట్లు.
కర్కాటకం: శుభకార్యాలకు సన్నాహాలు ప్రారంభిస్తారు. సంఘంలో ఆదరణ. నూతన పరిచయాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి.
సింహం: ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
కన్య: మిత్రులతో అకారణ వైరం. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో జాప్యం. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.
తుల: కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. మిత్రులతో విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి.
వృశ్చికం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. భూలాభాలు. వృత్తి, వ్యాపారాలలో ఉత్సాహం.
ధనుస్సు: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. కార్యసిద్ధి. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి.
మకరం: పనుల్లో ఆటంకాలు. ఆదాయానికి మించిన ఖర్చులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు.
కుంభం: పనుల్లో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో మార్పులు.
మీనం: రుణాలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు.