
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: శు.ద్వాదశి ప.3.10 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం: హస్త రా.12.20 వరకు, తదుపరి చిత్త, వర్జ్యం: ఉ.7.16 నుండి 9.01 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.05 నుండి 8.56 వరకు, తదుపరి ప.12.21 నుండి 1.12 వరకు, అమృత ఘడియలు: సా.5.46 నుండి 7.32 వరకు; రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం: 5.34, సూర్యాస్తమయం: 6.17.
మేషం.... శుభవార్తలు వింటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సంఘంలో ఆదరణ. వస్తులాభాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
వృషభం.... ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.
మిథునం.... పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. బంధువులతో విభేదాలు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు పనిఒత్తిడులు.
కర్కాటకం.... దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యవహారాలలో విజయం. భూ, గృహయోగాలు. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇబ్బందులు తొలగుతాయి.
సింహం.... ఆకస్మిక ప్రయాణాలు. బంధువులు, మిత్రులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.
కన్య.... ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆస్తి లాభం. సోదరుల కలయిక. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో అనుకూలత. ఉద్యోగులకు కొత్త హోదాలు.
తుల... ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు మార్పులు.
వృశ్చికం... పనుల్లో విజయం. ఆప్తులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు.
ధనుస్సు... కొత్త విషయాలు గ్రహిస్తారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉన్నతస్థితి.
మకరం..... పనులలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. మానసిక అశాంతి. అనారోగ్యం. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
కుంభం... వ్యయప్రయాసలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
మీనం..... పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. కొన్ని సమస్యలు తీరతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.