గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.చవితి ప.12.01 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: అనూరాధ రా.12.59 వరకు, తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ప.12.26 నుండి 1.15 వరకు, తదుపరి ప.2.53 నుండి 3.43 వరకు, అమృత ఘడియలు: ప.1.29 నుండి 3.14 వరకు
సూర్యోదయం : 5.55
సూర్యాస్తమయం : 6.10
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
మేషం.... పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. పుణ్యక్షేత్రాల సందర్శనం. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ధనవ్యయం.
వృషభం... కొత్త పనులు ప్రారంభిస్తారు. మిత్రులతో వివాదాలు తీరతాయి. ఆహ్వానాలు అందుతాయి. ఇంటాబయటా అనుకూలం. కొత్త వస్తువులు సేకరిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగానే సాగుతాయి.
మిథునం.... పరిచయాలు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు. విందువినోదాలు. వాహనయోగం. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి. విద్యార్థులకు మంచి ఫలితాలు.
కర్కాటకం.... కొత్త రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. మిత్రులతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.
సింహం..... పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు ఉండవచ్చు.
కన్య.... కొత్త పనులు పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ. విద్యావకాశాలు రాగలవు. ప్రముఖులతో పరిచయాలు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. దైవదర్శనాలు.
తుల..... బంధువులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. ధనవ్యయం.
వృశ్చికం...... ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. భూ, గృహయోగాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.
ధనుస్సు..... ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. విద్యార్థులకు నిరుత్సాహమే.
మకరం... నూతన ఉద్యోగయోగం. చర్చలు సఫలం. విందువినోదాలు. శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు సంతోషకరమైన సమాచారం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
కుంభం.... దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. భూములు, వాహనాలు కొంటారు. ఇంటర్వ్యూలలో విజయం. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. సంఘంలో ఆదరణ.
మీనం... ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ధనవ్యయం.


