
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయణం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: శు.షష్ఠి ఉ.10.09 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: అనూరాధ ప.12.50 వరకు, తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం: సా.6.20 నుండి 7.54 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.53 నుండి 10.42 వరకు, తదుపరి ప.2.44 నుండి 3.32 వరకు,
అమృతఘడియలు: రా.3.46 నుండి 5.20 వరకు;
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు,
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు,
సూర్యోదయం: 5.52,
సూర్యాస్తమయం: 5.57.
మేషం: కొత్త రుణాలు చేస్తారు. ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. బంధువులతో స్వల్ప వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.
వృషభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
మిథునం: శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. నూతన విషయాలు తెలుసుకుంటారు. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార ఉద్యోగాలలో నూతనోత్సాహం.
కర్కాటకం: పనులు నెమ్మదిగా సాగుతాయి. దూరప్రయాణాలు. వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా మారవచ్చు.
సింహం: శ్రమ పెరుగుతుంది. ధనవ్యయం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. దైవదర్శనాలు. విద్యార్థులకు ఇబ్బందులు.
కన్య: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. ఉద్యోగయోగం. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
తుల: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. పనుల్లో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. వ్యాపార, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. దైవచింతన. నిరుద్యోగులకు నిరుత్సాహం.
వృశ్చికం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. సోదరుల నుంచి కీలక సమాచారం. ఆహ్వానాలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.
ధనుస్సు: రుణఒత్తిడులు. ధనవ్యయం. అనారోగ్యం. మానసిక అశాంతి. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. ప్రయాణాలు వాయిదా.
మకరం: ఉద్యోగయోగం. పనులలో విజయం. శుభవార్తలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ప్రతిభ చాటుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు.
కుంభం: కుటుంబసౌఖ్యం. విలువైన సమాచారం. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. వ్యాపారులకు అధిక లాభాలు. నిరుద్యోగులకు నూతనోత్సాహం.
మీనం: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. మానసిక ఆందోళన.