ఈ రాశి వారు అనుకున్నది సాధిస్తారు, ధనలాభం | Today Telugu Horoscope On September 16th 2023: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu - Sakshi
Sakshi News home page

Today Telugu Horoscope: ఈ రాశి వారు అనుకున్నది సాధిస్తారు, ధనలాభం

Sep 16 2023 6:50 AM | Updated on Sep 16 2023 9:05 AM

Horoscope Today 16 09 2023 Rasiphalalu Telugu - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయణం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: శు.పాడ్యమి ఉ.7.54 వరకు తదుపరి విదియ, నక్షత్రం: ఉత్తర ఉ.7.33 వరకు, తదుపరి హస్త, వర్జ్యం: సా.4.37 నుండి 6.21 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.51 నుండి 7.27 వరకు, అమృతఘడియలు: రా.3.29 నుండి 4.44 వరకు

సూర్యోదయం :    5.51
సూర్యాస్తమయం    :  6.01
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుండి 3.00 వరకు 

మేషం: శుభకార్యాలకు ప్రణాళిక రూపొందిస్తారు. వ్యవహారాలలో మరింత అనుకూలత. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆందోళన తొలగుతుంది.

వృషభం: పనుల్లో స్వల్ప అవాంతరాలు. ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశ పరుస్తాయి. ఇంటాబయటా ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

మిథునం: పనులు మధ్యలో విరమిస్తారు. శ్రమ తప్పదు. ఆకస్మిక ప్రయాణాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.

కర్కాటకం: కొత్త పరిచయాలు. పోటీపరీక్షల్లో విజయం. స్నేహితులతో సఖ్యత. శుభవర్తమానాలు అందుతాయి. పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుబాటు కాగలవు.

సింహం: ఏ పని చేపట్టినా మందగిస్తుంది. దూరప్రయాణాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటుంది. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు పెరుగుతాయి.

కన్య: వ్యవహారాలలో విజయం. పలుకుబడి పెరుగుతుంది. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి.

తుల: బాధ్యతలు మరింత పెరుగుతాయి. కుటుంబసభ్యుల వైఖరి కొంత నిరాశ పరుస్తుంది. ధనవ్యయం. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

వృశ్చికం: ప్రయాణాలు అనుకూలిస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ధనవ్యయం. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

ధనుస్సు: పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

మకరం: పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలు కొన్ని ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

కుంభం: దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు కొద్దిపాటి లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.

మీనం: కొత్త పనులు చేపడతారు. ఆహ్వానాలు అందుతాయి. వివాదాల నుంచి గట్టెక్కుతారు. ధనలాభం సూచనలు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement