
గ్రహఫలం...మంగళవారం, 26.09.23
––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయణం, వర్ష ఋతువు
భాద్రపద మాసం, తిథి: శు.ద్వాదశి రా.11.14 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం: శ్రవణం ఉ.7.44 వరకు, తదుపరి ధనిష్ఠ,
సూర్యోదయం: 5.53
సూర్యాస్తమయం: 5.53
వర్జ్యం: ప.11.28 నుండి 12.04 వరకు,
దుర్ముహూర్తంఉ.8.17 నుండి 9.05 వరకు,తదుపరి రా.10.42 నుండి 11.31 వరకు,
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
అమృతఘడియలు: రా.8.23 నుండి 9.54 వరకు
మేషం: ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వస్తు,వస్త్రలాభాలు. ఉద్యోగులకు ప్రమోషన్లు. వ్యాపారాలు లాభిస్తాయి. స్థిరాస్తి వృద్ధి. ఆలయాలు సందర్శిస్తారు.
వృషభం: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో వివాదాలు. ధనవ్యయం.
మిథునం: ప్రయత్నాలు ముందుకు సాగవు. ధనవ్యయం. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. శ్రమాధిక్యం. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు తప్పుతాయి.
కర్కాటకం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. నూతన విద్య, ఉద్యోగయోగాలు. కీలక నిర్ణయాలు.
సింహం: కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
కన్య: ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. ధనవ్యయం. దూరప్రయాణాలు. ఆలయాల సందర్శనం. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగమార్పులు.
తుల: ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ప్రయాణాలు వాయిదా. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
వృశ్చికం: చర్చలు సఫలం. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సోదరులతో ఆనందంగా గడుపుతారు. వస్తులాభాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.
ధనుస్సు: ప్రయాణాలు వాయిదా. శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. అనారోగ్యం. ఇంటాబయటా ఒత్తిడులు.
మకరం: పరిస్థితులు అనుకూలిస్తాయి. శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. గృహ, వాహనయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
కుంభం: కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. ధనవ్యయం. అనుకోని సంఘటనలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో వివాదాలు.
మీనం: కుటుంబసౌఖ్యం. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కాంట్రాక్టులు లభిస్తాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటాయి.