Today Telugu Horoscope: ఈ రాశి వారికి వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి

daily horoscope 22 11 2023 rashi phalal telugu  - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: శు.దశమి రా.10.31 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: పూర్వాభాద్ర  సా.6.55 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం: రా.3.56 నుండి 5.25 వరకు (తెల్లవారితే గురువారం), దుర్ముహూర్తం: ప.11.21 నుండి 12.07 వరకు, అమృత ఘడియలు: ఉ.11.31 నుండి 12.56 వరకు; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 6.11, సూర్యాస్తమయం: 5.21. 

మేషం... ప్రయాణాలు వాయిదా. పనుల్లో అవరోధాలు. మిత్రులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. విద్యార్థులు, నిరుద్యోగులకు నిరుత్సాహం.

వృషభం... కొత్త విషయాలు తెలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొంటారు. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. నూతన విద్యావకాశాలు. పరిచయాలు పెరుగుతాయి.

మిథునం.... పనులు విజయవంతమవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ధన, వస్తులాభాలు. బాకీలు వసూలవుతాయి. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

కర్కాటకం.... కుటుంబ, ఆరోగ్యసమస్యలు. వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు పెరుగుతాయి. 

సింహం... అనుకోని ధనవ్యయం. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఆలయ దర్శనాలు. ఆరోగ్యసమస్యలు. విద్యార్థులు శ్రమానంతరం ఫలితం పొందుతారు.

కన్య.... కొత్త పనులు ప్రారంభిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. దూరప్రయాణాలు.ఆలయ దర్శనాలు. ధనలబ్ధి. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. విందువినోదాలు.

తుల.... ప్రయత్నాలలో అనుకూలత. సోదరుల నుంచి ధనలాభం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు. కుటుంబసమస్యలు తీరతాయి. నిరుద్యోగులు ఉద్యోగాలు దక్కించుకుంటారు.

వృశ్చికం... కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగుల యత్నాలు కొంత మందగిస్తాయి. దైవదర్శనాలు.

ధనుస్సు.. ఆర్థికపరమైన ఇబ్బందులు. పనుల్లో తొందరపాటు. బంధువులతో వివాదాలు.  శ్రమాధిక్యం. ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.

మకరం... నూతన ఉద్యోగయోగం. ముఖ్య∙నిర్ణయాలు. వృత్తి,వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. శుభకార్యాల రీత్యా ఖర్చులు. విద్యార్థులకు శుభవార్తలు.

కుంభం..... ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. శ్రమ మరింత పెరుగుతుంది.

మీనం.. ఉద్యోగయత్నాలు అనుకూలం. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి,వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. కళాకారులకు సత్కారాలు.
 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top